Headlines

3BHK Movie: ఓటీటీలోకి వచ్చేసిన సిద్ధార్థ్ ఫ్యామిలీ మూవీ.. 3BHK స్ట్రీమింగ్ ఎక్కడంటే..

3BHK Movie: ఓటీటీలోకి వచ్చేసిన సిద్ధార్థ్ ఫ్యామిలీ మూవీ.. 3BHK స్ట్రీమింగ్ ఎక్కడంటే..


హీరో సిద్ధార్థ్, ఆర్. శరత్‌కుమార్, దేవయాని, మీతా రఘునాథ్ నటించిన తమిళ కామెడీ-డ్రామా 3BHK. చిన్న సినిమాగా జూలై 4న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. శ్రీ గణేష్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం అభిమానులు, విమర్శకుల నుండి పాజిటివ్ రివ్యూస్ అందుకుంది. ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబం రోజువారీ కష్టాలు, కలలను ఈ సినిమాతో వెండితెరపై చూపించారు. ఇక ఎప్పటిలాగే సిద్ధార్థ్ మరోసారి తన అద్భుతమైన నటనతో ఆకట్టుకున్నారు. థియేటర్లలో విడుదలైన ఒక నెల తర్వాత 3BHK ఓటీటీలోకి వచ్చేసింది. ఈ సినిమా (ఆగస్ట్ 1) నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది.

అలాగే విదేశాల్లో సింప్లీ సౌత్‌ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటనను ప్లాట్‌ఫామ్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. తమిళంతోపాటు తెలుగులోనూ ఈ మూవీ అందుబాటులోకి వచ్చేసింది. ప్రతి మధ్యతరగతి కుటుంబానికి ఒక కల ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించారు.

కథ విషయానికి వస్తే..

ఇవి కూడా చదవండి

వాసుదేవన్ (శరత్‌కుమార్ పోషించిన పాత్ర), అతని కుటుంబం 3 BHK అపార్ట్‌మెంట్ కోసం కొంత డబ్బు ఆదా చేసుకుంటారు. ఎప్పటికైనా సొంతిల్లు కొనుక్కోవాలని కలలు కనే వాసుదేవన్ తన కొడుకు ప్రభు (సిద్ధార్థ్) ద్వారా నెరవేర్చుకోవాలని అనుకుంటాడు. కానీ ప్రభు కెరీర్ పరంగా ఒడిదుడుకులు ఎదుర్కొంటారు. 34 ఏళ్లు వచ్చినా సరైన ఉద్యోగం లేక తండ్రిపైనే ఆధారపడి జీవిస్తుంటాడు. ఈ క్రమంలోనే తన తండ్రి కల నెరవేర్చేందుకు ప్రభు ఏం చేశాడు.. ? ఆ తర్వాత వారి జీవితాల్లో వచ్చిన ఆర్థిక సమస్యలు, జీవిత సవాళ్లను ఎలా ఎదుర్కొంటారు ? అనేది సినిమా.

ఇవి కూడా చదవండి.. OTT Movie: బాబోయ్.. ఓటీటీలో సంచలనం సృష్టిస్తోన్న థ్రిల్లర్ సినిమాలు.. ఊహకు అందని ట్విస్టులు..

Megastar Chiranjeevi: చిరంజీవికి ప్రియురాలిగా, భార్యగా, తల్లిగా, చెల్లిగా నటించిన హీరోయిన్..

ఒక్క యాడ్‏తో ఫేమస్ అయ్యింది.. హీరోయిన్లకు మించిన క్రేజ్.. ఈ అమ్మడు ఇప్పుడేలా ఉందో తెలుసా.. ?

Actress: అప్పుడు పద్దతిగా.. ఇప్పుడు గ్లామర్ బ్యూటీగా.. సెకండ్ ఇన్నింగ్స్‏లో అందాల రచ్చ..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *