
Andhra: కాసిన్ని నీళ్లు ఇవ్వమని ఇంట్లోకి వచ్చాడు.. ఆమె ఒంటరిగా లోపలికి వెళ్లేసరికి..
బంగారం కోసం ఒంటరి మహిళలను టార్గెట్ చేస్తున్నారు. పట్టపగలే హత్యలకు పాల్పడుతున్నారు. చిరు వ్యాపారం చేసుకునే మహిళలనే ఇందుకు లక్ష్యంగా చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే వినుకొండలో జరిగిన హత్య కలకలం రేపింది. చిల్లర కొట్టు నడుపుకునే మహిళను ఉదయం పూటే హత్య చేసి నిందితులు ఆధారాలు దొరక్కుండా పారిపోయారు. నిందితుల కోసం పోలీసులు అన్ని ఆధారాలను పరిశీలిస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే.. వినుకొండ కల్యాణపురి కాలనీలో ఆలపాటి పుష్పలత చిల్లర కొట్టు నిర్వహిస్తుంటుంది. ఆమె భర్త రవీంద్ర పట్టణంలోనే…