
Indian Traditions: మిక్సీ పచ్చడిలో దొరకని మధురిమ.. రోటి పచ్చళ్లకే ఎందుకింత రుచో తెలుసా?
రోలు, రోకలి… ఒకప్పుడు ప్రతి వంటింట్లోనూ తప్పనిసరిగా కనిపించే వస్తువులు. ఇప్పుడు అలంకరణ వస్తువులుగా మారాయి. కారణం మిక్సీ గ్రైండర్లు. వేగం, సౌలభ్యం పేరుతో వాటి స్థానంలో మిక్సీలు చేరాయి. అయితే, రోటిలో చేసిన పచ్చడి రుచి మిక్సీ పచ్చడికి ఉండదనేది నూటికి నూరుపాళ్లు నిజం. ఈ తేడాకు కారణాలు చాలానే ఉన్నాయి. రోటిలో పచ్చడి నూరుతున్నప్పుడు పదార్థాలు పూర్తిగా పేస్ట్‌లా మారకుండా కాస్త పలుకులుగా ఉంటాయి. ఈ పలుకులు పంటి కింద పడితే వచ్చే అనుభూతి…