
ఇలా బరిలోకి దిగాడో లేదో.. అలా గవాస్కర్ రికార్డ్‌కే ఎసరెట్టేశాడుగా.. ‘నంబర్ 1’గా టీమిండియా కెప్టెన్
భారత టెస్ట్ జట్టు కెప్టెన్ శుభ్ మన్ గిల్ చరిత్ర సృష్టించాడు. సునీల్ గవాస్కర్ పేరిట ఉన్న దశాబ్దాల నాటి రికార్డును బద్దలు కొట్టి, ఒక టెస్ట్ సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన భారత కెప్టెన్‌గా నిలిచాడు. ఇంగ్లాండ్‌తో జరుగుతున్న ప్రస్తుత టెస్ట్ సిరీస్‌లో గిల్ అద్భుతమైన ఫామ్‌ను కొనసాగిస్తూ ఈ అరుదైన మైలురాయిని చేరుకున్నాడు. సునీల్ గవాస్కర్ 1978/79లో వెస్టిండీస్‌పై ఆడిన టెస్ట్ సిరీస్‌లో 732 పరుగులు చేసి ఒక భారత కెప్టెన్‌గా అత్యధిక పరుగులు…