
చదివింది మర్చిపోతున్నారా..? ఇలా చేస్తే ఈజీగా గుర్తుంటుంది.. టెన్షన్ పడాల్సిన అవసరం లేదు
చదవడం చాలా మంది చేయగలిగిన పనే అయినా చదివిన విషయాన్ని మదిలో నిలుపుకోవడం మాత్రం అంత సులభమైన పని కాదు. ఎన్నో గంటలు చదివిన తర్వాత పరీక్షల సమయంలో ఒక్క విషయం కూడా గుర్తుకు రాకపోవడం అనేక మందిలో నిరుత్సాహాన్ని కలిగిస్తోంది. అయితే కొన్ని సరళమైన అలవాట్లు మన మెమొరీ పవర్‌ను బాగా పెంచుతాయి. చదవడానికి మీరు కూర్చోబోయే ప్రదేశం శుభ్రంగా, నిశ్శబ్దంగా ఉండాలి. చుట్టూ శబ్దాలు లేకుండా ఏ గడబిడీ లేకుండా ఉంటే చదివే విషయంపై…