
జమ్మూ కాశ్మీర్‌లో ఆపరేషన్ షురూ.. ఉగ్రవాదుల జాబితాను విడుదల చేసిన సైన్యం!
పహల్గామ్ ఉగ్రదాడి తరువాత మరోసారి జమ్మూ కాశ్మీర్‌లో టెర్రరిస్టులు దాడులకు పాల్పడే అవకాశం ఉందని నిఘా వర్గాలు హైఅలర్ట్ జారీ చేశాయి. లష్కర్ ఉగ్రవాదులు దాడులకు తెగబడే అవకాశం ఉందని హెచ్చరించారు. పర్యాటక స్థలాల్లో భద్రతను పెంచాలని సూచించారు. టార్గెట్ కిల్లింగ్స్‌కు పాల్పడే అవకాశం ఉందని హెచ్చరించారు. టూరిస్టు కేంద్రాలు ఉగ్రవాదుల హిట్‌లిస్ట్‌లు ఉన్నట్టు గుర్తించారు. దక్షిణ కాశ్మీర్‌లో ఎక్కువగా దాడులకు పాల్పడే అవకాశం ఉందని హెచ్చరించారు. మరోవైపు ఉగ్రవాదులను అంతమొందించడానికి సైన్యం ఏకకాలంలో అనేక కార్యకలాపాలను…