
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. చడిచప్పుడు లేకండా చిటికెలో మాయం చేశారు.. !
బర్డ్ ప్లూ భయంతో చికెన్ అమ్మకాలు మందగించాయి. బర్డ్ ప్లూ భయం లేదని చాటడానికి అనేక చోట్ల చికెన్ మేళాలు పెడుతున్నారు. అయినప్పటికీ చికెన్ అమ్మకాలు ఇంకా సాధారణ స్థాయికి రావడం లేదు. మరోవైపు చికెన్ అమ్మకాలు మందగించడంతో మటన్ కు డిమాండ్ పెరిగింది. గతం కంటే అధికంగా మటన్ అమ్మకాలు కొనసాగుతన్నాయి. అయితే మాములుగా కొనుక్కొని వండుకొని తింటే ఏముంటుందనుకున్నారో ఏమో ఆ దొంగలు… ఏకంగా వాటినే దొంగలించారు. అది కూడా సరికొత్త పద్దతిని ఎంచుకుని…