
Champions Trophy: బంగ్లాతో మ్యాచ్ టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్, పిచ్ రిపోర్ట్ ఇదే?
ఛాంపియన్స్ ట్రోఫీ కంటే ముందు ఇంగ్లండ్ మూడో వన్డేల సిరీస్ ఆడిన టీమిండియా అందులో మంచి ప్రదర్శన కనబర్చింది. ముఖ్యంగా టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఫామ్‌లోకి రావడంతో జట్టు నెక్ట్స్ లెవెల్‌లో కనిపిస్తోంది. ప్రస్తుతం టీమిండియా ఉన్న ఫామ్‌లో బంగ్లాదేశ్‌పై విజయం నల్లేరుపై నడకలానే అనిపిస్తున్నా.. చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలనే సూత్రాన్ని మాత్రం టీమిండియా మర్చిపోవద్దు. బంగ్లాదేశ్‌ను అస్సలు లైట్ తీసుకోవద్దని క్రికెట్ ఎక్స్‌పర్ట్స్ కూడా హెచ్చరిస్తున్నారు….