
12 గంటలుగా రోడ్డుపైనే వృద్ధురాలి డెడ్ బాడీ.. తల్లడిల్లిన కూతురు! స్పందించని మున్సిపాలిటీ..
జోగిపేట, ఫిబ్రవరి 27: నడి రోడ్డుపై వృద్ధ మహిళ మృతదేహం వద్ద ఆమె కూతురు నిర్విరామంగా ఏడుస్తూనే ఉంది. అటుఇటు వచ్చేవాళ్లు చూస్తున్నారే తప్ప ఏం జరిగిందని కనీసం అడగలేదు. అలా ఏకంగా 12 గంటలపాటు అభాగ్యురాలైన వృద్ధురాలి శవం రోడ్డుపైనే ఉండిపోయింది. కనీసం మున్సిపల్ సిబ్బంది కూడా కన్నెత్తి చూడలేదు. అంత్యక్రియలు నిర్వహించేందుకు కూతురు ఎందరిని వేడుకున్నా ఎవరూ కనికరించలేదు. ఈ హృదయవిదారక ఘటన మెదక్ జిల్లా జోగిపేటలో ఫిబ్రవరి 26 (బుధవారం) చోటు చేసుకుంది….