
Lifestyle: చలికాలం స్నానం చేసేప్పుడు ఈ తప్పులు అస్సలు చేయకండి..
చలికాలం జీవనశైలిలో పలు మార్పులు చేసుకోవాలని నిపుణులు చెబుతుంటారు. మారిన వాతావరణంలో వ్యాధులు సోకకుండా ఉండేందుకు పలు జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతుంటారు. అయితే మనకు తెలిసో తెలియకో కొన్ని మిస్టేక్స్ చేస్తుంటాం. అలాంటి వాటిలో స్నానం విషయంలో చేసే తప్పులు కొన్ని. సాధారణంగా చలికాలంలో వేడి నీటితో స్నానం చేస్తుంటాం. అయితే ఎక్కువ వేడి ఉన్న నీటితో స్నానం చేయడం వల్ల చర్మం పొడిబారుతుందని నిపుణులు చెబుతున్నారు. దీంతో చర్మం పగలడం వంటి సమస్యలు ఎదురవుతాయి. అందుకే…