
Viral Video: ట్రైన్‌లో కిటికీ కర్టెన్ వద్ద ఏదో కదులుతూ కనిపించింది.. చెక్ చేయగా.. వామ్మో..
రైలులో గోవాకు వెళ్తున్న వృద్ధ దంపతులకు ఊహించని షాక్ తగిలింది. వారు బుక్ చేసుకున్న లోయర్ బెర్త్ కిటికీ కర్టెన్ వెనుక పాము కనిపించడంతో.. కంగుతున్నారు. ఈ ఘటన జరిగిన సమయంలో వారు… జార్ఖండ్‌లోని జసిదిహ్ నుంచి.. గోవాకు సెకండ్ ఏసీ కోచ్‌లో ప్రయాణిస్తున్నారు. వృద్ధ దంపతులు కిటికీ తెర వెనకాల ఏదో కదులుతున్నట్లు గమనించారు. నిశితంగా పరిశీలించగా విషపూరితమైన పామును గుర్తించారు. వారు వెంటనే ఫోన్ ద్వారా తమ కుమారుడికి సమాచారం అందించారు. సహాయం కోసం…