
Dera Baba: డేరాబాబా మళ్లీ విడుదల.. హర్యానా ఎన్నికల్లో ఆయన ప్రభావం ఎవరికి లాభం?
హర్యానా… మహాభారతంలో కురుక్షేత్ర యుద్ధం, మొఘలుల పాలనకు నాంది, ముగింపు పలికిన పానిపట్టు యుద్ధాలు జరిగిన నేల. పురాణేతిహాసాలు, చరిత్ర పేజీల్లోనే కాదు, వర్తమానంలో కుస్తీ పట్టుతో మట్టికరిపించే మల్లయోధులను దేశానికి అందిస్తున్న ప్రాంతం. ఇప్పుడు అక్కడ ఎన్నికల యుద్ధం జరుగుతోంది. జాతీయ పార్టీలు కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ (BJP), ఆమ్ ఆద్మీ పార్టీ (AAP), బహుజన్ సమాజ్ పార్టీ (BSP)తో పాటు ఇండియన్ నేషనల్ లోక్‌దళ్ (INLD), జన్‌నాయక్ జనతా పార్టీ (JJP), ఆజాద్…