
IIFA Awards 2024: ఐఫాను ఊపేసిన పుష్ఫ.. ‘ఊ అంటావా’ పాటకు షారుఖ్ ఖాన్, విక్కీల స్టెప్పులు.. వీడియో చూడండి
సినిమా రంగంలో ప్రతిష్ఠాత్మకంగా భావించే ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిలిం అకాడమీ (ఐఫా) అవార్డుల ప్రదానోత్సవం అబుదాబి వేదికగా కన్నుల పండువగా జరగుతోంది. సెప్టెంబర్ 27న మొదలైన ఈ అవార్డుల వేడుక ఆదివారం (సెప్టెంబర్ 29)తో ముగియనుంది. తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ, హిందీ.. ఇలా దేశవ్యాప్తంగా ఉన్న అన్నీ సినీ పరిశ్రమల నుంచి ఎందరో స్టార్స్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఐఫా అవార్డుల ఈవెంట్ కు బాలీవుడ్ హీరోలు షారుఖ్ ఖాన్, విక్కీ కౌశల్ హోస్టులుగా వ్యవహరించారు….