
Monthly Horoscope: వారి పెళ్లి, ఉద్యోగ ప్రయత్నాలు సఫలం.. 12 రాశుల వారికి జనవరి మాసఫలాలు
కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3): ఈ రాశిలో శుక్ర, శనుల సంచారం వల్ల రాజయోగాలు కలిగాయి. వృత్తి, ఉద్యోగాల్లో హోదాలు పెరుగుతాయి. ప్రాభవం, ప్రాధాన్యం వృద్ధి చెందుతాయి. దశమ స్థానంలో బుధుడు, లాభ స్థానంలో రవి కూడా బాగా అనుకూలంగా ఉండడం వల్ల ఆదాయం ఇబ్బడిముబ్బడిగా వృద్ధి చెందుతుంది. ఉద్యోగంలో జీతభత్యాలు పెరిగే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో నష్టాలు తగ్గి, లాభాలు పెరుగుతాయి. ముఖ్యంగా జీవితంలో కొన్ని శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి….