2 కోట్లతో సొంతూరిలో ఆసుపత్రి.. ఇంకా ఎన్నో.. బయటికొచ్చిన ఆర్. నారాయణ మూర్తి గొప్పతనం

2 కోట్లతో సొంతూరిలో ఆసుపత్రి.. ఇంకా ఎన్నో.. బయటికొచ్చిన ఆర్. నారాయణ మూర్తి గొప్పతనం


ఇప్పటికీ అదే పంథాతో, ఒకే భావజాలంతో సినిమాలు తీస్తూ సమాజంలోని అన్యాయాలను ప్రశ్నిస్తున్నారు. ఇప్పటివరకు 30కు పైగా సినిమాల్లో నటించి, నిర్మించినా.. ఆయన హంగులు, ఆర్భాటాలకు దూరం. ఒక చిన్న అద్దె గదిలో నివాసముంటారు. ఎప్పుడూ ఆటోలు, ఆర్టీసీ బస్సులోనే ప్రయాణిస్తారు. అందుకే ఆర్ నాయారణ మూర్తి అన్నా.. ఆయన సింప్లిసిటీ అన్నా అందరికీ గౌరవం. అయితే ఆయన తన ఊరి కోసం చేసిన ఓ మంచి పని బయటికి వచ్చింది. అది కాస్తా ఇప్పుడు ఆయన పై మరింత రెస్పెప్ట్ పెంచేలా చేసింది. చూడడానికి సాధారణ మనిషి లాగా కనిపించే నారాయణ మూర్తి.. ఎన్నో మంచి పనులు చేశారట. ముఖ్యంగా తన సొంతూరిలో రూ. 2 కోట్లతో ఆస్పత్రిని కట్టించారట. ఈ విషయం ఇప్పటికీ చాలా మందికి తెలియదు. పైగా కోట్లు పెట్టి కట్టించిన ఆస్పత్రికి తన పేరు గానీ, తన తల్లిదండ్రుల పేరుగానీ పెట్టుకోలేదట. అలాగే అదే ఊర్లో ఆలయం కూడా కట్టించాడు. ఇంత చేసినా ఏనాడూ ఇది చేశాను అని చెప్పుకోకుండా చాలా సింపుల్‌గా లైఫ్ లీడ్ చేస్తుంటాడు మన పీపుల్ స్టార్ నారాయణ మూర్తి. ఆర్. నారాయణ మూర్తి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం ‘యూనివర్సిటీ. అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఆగస్టు 22 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్‌‌‌‌‌‌‌‌మీట్‌‌‌‌‌‌‌‌లో గోరటి వెంకన్న… నారాయణ మూర్తి గొప్పతనం గురించి.. తన సొంతూరికి చేసిన సేవల గురించి బయపెట్టారు. దీంతో ఆర్ నారాయణ మూర్తిని దేవుడంటూ కొనియాడుతున్నారు ఆయన ఫ్యాన్స్.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఛావా రికార్డు బ్రేక్ చేసిన 3 కోట్ల మూవీ.. చూస్తే వణికిపోవాల్సిందే

రూ.2 కోట్ల బడ్జెట్.. రూ.1600 కోట్ల కలెక్షన్స్.. బాక్సాఫీస్ షేక్ చేసిన హారర్ మూవీ..

అనసూయను మోసం చేసి డబ్బు గుంజిన కేటుగాళ్లు

చిరులా.. నోరు జారిన నాగ్‌ రజినీ ఫ్యాన్స్ సీరియస్

ఆ లెజెండరీ డైరెక్టర్‌ను ఫాలో అవుతున్న సందీప్ రెడ్డి వంగా…



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *