హైడ్రాపై దానం సంచలన వ్యాఖ్యలు.. ఆ విషయంలో నో కాంప్రమైజ్‌

హైడ్రాపై దానం సంచలన వ్యాఖ్యలు.. ఆ విషయంలో నో కాంప్రమైజ్‌


ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. హైడ్రా విషయంలో వెనక్కి తగ్గేది లేదన్నారు. పేదల ఇళ్లు కూల్చుతామంటే ఊరుకోనన్నారు. తనకు ఎలాంటి నోటీసులూ రాలేదని చెప్పారాయన. అధికారుల విషయంలో కాంప్రమైజ్‌ అవ్వనని దానం తేల్చిచెప్పారు. వైఎస్‌ హయాంలో కూడా తాను కాంప్రమైజ్‌ అవ్వలేదన్నారు. తనపై 173 కేసులున్నాయి.. పోతే జైలుకు పోతా అని దానం అన్నారు. తన ఇంట్లో వైఎస్‌, కేసీఆర్‌ ఫొటోలు ఉన్నాయని చెప్పారు. ఎవరి అభిమానం వాళ్లది ఇష్టమైన నేతల ఫొటోలు ఉంటే తప్పేంటని ప్రశ్నించారు దానం నాగేందర్‌.

దానం నాగేందర్‌ హైడ్రా విషయంలో తొలి నుంచి అసంతృప్తిగా ఉన్నారు. ఇటీవల తాను చెప్పినా కూడా ఆపకుండా కూల్చివేయడంపై ఆయన అధికారులపై ఆగ్రహంతో ఉన్నారు. కూల్చివేతల విషయంలో అధికారులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారన్నారు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్. పేదలను ఇబ్బందిపెట్టేలా వారి వ్యవహారం ఉందన్నారు. కూల్చివేతలు చేపట్టాలని భావిస్తే ముందు ఓల్డ్‌ సిటీ నుంచే మొదలుపెట్టాలని ఇటీవల ఓ మీడియాతో మాట్లాడుతూ అధికారులకు సవాల్‌ విసిరారు. ఈ అంశంలో తమకు నిద్రలేకుండా పోయిందన్నారు.

కొందరు అధికారులు తామే సుప్రీం అన్నట్టుగా వ్యవమరిస్తున్నారని ఆరోపించారు దానం నాగేందర్. అధికారులకు పూర్తి స్వేచ్ఛ ఇస్తే ప్రభుత్వాలు నిలబడవన్నారు. అధికారులు ప్రభుత్వం కంట్రోల్‌లో ఉండాలని.. ప్రభుత్వ నిర్ణయాలకు తగ్గట్టుగా నడుచుకోవాలని అభిప్రాయపడ్డారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *