హనీమూన్ హత్య కేసులో మరో దిమ్మతిరిగే ట్విస్ట్.. ఎంక్వయిరీలో వెలుగులోకి షాకింగ్ నిజం..

హనీమూన్ హత్య కేసులో మరో దిమ్మతిరిగే ట్విస్ట్.. ఎంక్వయిరీలో వెలుగులోకి షాకింగ్ నిజం..


రాజా రఘువంశీ హనీమూన్ హత్య కేసులో ఎప్పటికప్పుడు సరికొత్త ట్విస్టులు తెరపైకి వస్తున్నాయి. వివాహేతర సంబంధం వల్లే తాను పెళ్లి చేసుకున్న రాజా రఘువంశీని సోనమ్ హత్య చేసినట్టు అంతా భావించారు. ఇప్పటివరకు ఈ కోణంలోనే పోలీసుల విచారణ జరుగుతూ వచ్చింది. అయితే తాజాగా ఈ కేసుకు సంబంధించి హవాలా లావాదేవీలు బయటపడటం మరింత ఇంట్రెస్టింగ్‌గా మారింది. కేసులో ప్రధాన నిందితులైన సోనమ్, ఆమె ప్రియుడు రాజ్ కుష్వాహా మొబైల్ ఫోన్లలో హవాలా లావాదేవీలకు సంబంధించిన వ్యవహారాలు వెలుగుచూశాయి. దీంతో లవ్ క్రైమ్ స్టోరీలో ఆర్థిక నేరం కోణం కూడా కనిపిస్తోంది.

రాజ్ కుష్వాహా మొబైల్ ఫోన్‌లో పలు పాస్‌వర్డ్‌లు, చిరిగిన నోట్లు , హవాలా లావాదేవీల ఆధారాలు లభించాయి. అందులో పాత 10 రూపాయల నోట్ల ఫోటోలు కూడా దొరికాయని, వీటిని హవాలా లావాదేవీలలో ఉపయోగిస్తారని పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితుడు రాజ్, సోనమ్ , గోవింద్‌తో వ్యాపారం చేస్తున్నట్లు పోలీసులు విచారణలో ఒప్పుకున్నట్టు తెలిసింది. సోనమ్ రాజ్ ద్వారా రూ. 50,000 హంతకుడికి పంపారని.. ఇది హవాలా నెట్‌వర్క్‌కు చెందినదిగా భావిస్తున్నారు. నిందితుడు సోనమ్ సోదరుడు గోవింద్‌తో కలిసి వ్యాపారం చేసినట్టు గుర్తించారు. ఈ వ్యాపారంలో హవాలా లావాదేవీలు జరిగినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. సోనమ్ కుటుంబానికి సమీప బంధువైన జితేంద్రకు చెందిన ఖాతాల ద్వారా సోనమ్, గోవింద్ రహస్య లావాదేవీలు జరిపినట్టు గుర్తించారు. కొన్ని ఖాతాల్లో రూ. 14 లక్షల వరకు విత్ డ్రా, డిపాజిట్‌లు ఉన్నట్టు గుర్తించారు. ఇండోర్ క్రైమ్ బ్రాంచ్ హవాలాకు సంబంధించిన అన్ని పత్రాలు, డిజిటల్ డేటా , నగదు లావాదేవీ వివరాలను ఈడీకి అందజేసింది. మరోవైపు ఈ వ్యవహారంలో నిజానిజాలు తెలుసుకునేందుకు సోనమ్, రాజ్ కుష్వాహాకు నార్కో పరీక్షలు నిర్వహించాలని రాజా కుటుంబం డిమాండ్ చేసింది.

మరోవైపు వేగంగా తన వ్యాపారాన్ని విస్తరించిన గోవింద్ సంపాదనపై కూడా ఇప్పుడు అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అతడు హవాలా వ్యాపారంలో పాల్గొన్నాడని , తెరవెనుక అక్రమ లావాదేవీలు చేస్తున్నట్లు అనుమానిస్తున్నారు. ఈ సంఘటనపై పోలీసులతో పాటు ED బృందాలు దర్యాప్తు కొనసాగిస్తున్నాయి. రాజా రఘువంశీ హత్య కేసులో మొదట ప్రేమ వ్యవహారం, ఆపై వేరే యువకుడితో యువతి సంబంధమే కారణమని అంతా అనుకున్నారు. కానీ ఇప్పుడు వెలుగుచూస్తున్న కొత్త విషయాలతో రఘువంశీ మర్డర్ కేసులో హవాలా వ్యవహారం కూడా కీలక పాత్ర పోషించినట్లుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *