ఆంజనేయ స్వామి చాలా శక్తివంతమైన వారు అని చెప్తుంటారు. అయితే పెద్దవారు స్త్రీలు హనుమంతుడికి ఉపవాసం ఉండకూడదు, మరీ ముఖ్యంగా హనుమాన్ పాదాలు తాకకూడదు అని చెబుతుంటారు. అయితే అసలు స్త్రీలు హనుమాన్ పాదాలు ఎందుకు తాకకూడదో? దాని గురించి పండితులు ఏం చెబుతున్నారో ఇప్పుు తెలుసుకుందాం.
ఆంజనేయ స్వామి అంటే చాలా మందికి భక్తి ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా మహిళలు హనుమంతుడిని పూజించడానికి ఎక్కువగా ఇష్టపడుతుంటారు. ఎందుకంటే? వీర బజరంగబలిని పూజించడం ద్వారా అన్ని కష్టాలు తొలగిపోతాయని వారి నమ్మకం. ఇక మంగళవారం లేదా శని వారం హనుమంతుడిని పూజించడానికి ఉత్తమ రోజుగా పరిగణిస్తారు. అయితే హనుమంతుడిని పూజించాలంటే చాలా నియమ, నిబంధనలు ఉంటాయి.
చాలా వరక పెళ్లైన మహిళలు ఆంజనేయ స్వామి వారిని పూజించడంలో ఎలాంటి తప్పు ఉండదు. కానీ వీరు హనుమంతుడిని పూజించేటప్పుడు తప్పకుండా కొన్ని నియమాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలంట. అందులో ఒకటి పూజ సమయంలో భగవంతుని పాదాలను మహిళలు అస్సలే తాకకూడదు. ఇలా తాకడం చాలా తప్పు అని చెప్తుంటారు. ఎందుకంటే? హనుమంతుడి పాదాలను పురుషులు మాత్రమే తాకగలరు. దీనికి కారణం హనుమంతుడు బాల్యం నుండే బ్రహ్మచారి. బ్రహ్మచారి అంటే ప్రాపంచిక కోరికలకు దూరంగా ఉండేవాడు.
ఇదే కాకుండా హనుంమతుడు ప్రతి స్త్రీని తన తల్లిగా భావిస్తాడు, ఏ తల్లి కూడా తన కొడుకు పాదాలను తాకదు. అందుకే మహిళలు హనుమంతుడి పాదాలను తాకడానికి బదులుగా చేతులు జోడించి నమస్కరిస్తారు. అందుకే పెద్దవారు, పండితులు మహిళలు అస్సలే హనుమంతుడి పాదాలను తాకి నమస్కరించకూడని సూచిస్తుంటారు.
ఇవే కాకుండా హనుమాన్ పూజలో చాలా నియమాలు ఉన్నాయంట. పాదాలను తాకడమే కాకుండా, మహిళలు హనుమంతుని పూజించేటప్పుడు సింధూరం సమర్పించడం, తలవంచడం లాంటివి చేయకూదంట. ఇలా చేస్తూ హనుమంతుడిని పూజించడం మంచిది కాదు అని చెప్తున్నారు పండితులు.