Headlines

సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టులో వెంకీ, మహేష్ పేర్లు ఏంటో తెలుసా..? సినిమాలో పెట్టుంటే అదిరిపోయేది

సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టులో వెంకీ, మహేష్ పేర్లు ఏంటో తెలుసా..? సినిమాలో పెట్టుంటే అదిరిపోయేది


తెలుగు అడియన్స్ హృదయాల్లో నిలిచిపోయిన సినిమాల్లో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు ఒకటి. సూపర్ స్టార్ మహేష్ బాబు, విక్టరీ వెంకటేశ్ కలిసి నటించిన ఈ చిత్రానికి శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించారు. చక్కటి ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కించిన ఈ మూవీ సినీ ప్రియులను ఆకట్టుకుంది. ఇందులోని సాంగ్స్ కూడా మంచి హిట్టయ్యాయి. మహేష్ బాబు కామెడీ టైమింగ్.. వెంకీ యాక్టింగ్ అదిరిందనే చెప్పాలి. అన్ని ఎమోషన్స్ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యాయి. ఇందులో సమంత, అంజలి, అభినయ, జయసుధ, ప్రకాష్ రాజ్ కీలకపాత్రలు పోషించారు. అయితే ఈసినిమాలో మహేష్ కామెడీ టైమింగ్ గురించి చెప్పక్కర్లేదు. ఈ సినిమాతో సరికొత్త ట్రెండ్ సెట్ చేశారు మహేష్ బాబు, వెంకటేష్. ఈ సినిమాకు దిల్ రాజు నిర్మాతగా వ్యవహరించారు.

6 ఏళ్ల వయసులోనే ఎంట్రీ.. అవకాశాలు లేక ఆత్మహత్య చేసుకోవాలనుకుంది.. ఇప్పుడు ఆమె టాప్ సింగర్

ఇక ఈ సినిమాకు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఇప్పటికీ ఈ సినిమా వస్తుందంటే టీవీల ముందు కదలకుండా చూసే ఆడియన్స్ చాలా మంది ఉన్నారు. ఇదిలా ఉంటే త్వరలోనే సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాను రీ రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమా మార్చి 7న రీరిలీజ్ కాబోతుంది. దాంతో మహేష్ బాబు ఫ్యాన్స్ ఈ సినిమా కోసం ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ సినిమాలో మహేష్ బాబు, వెంకటేష్ ను పెద్దోడు చిన్నోడు అని పిలుస్తూ ఉంటారు.

ఇదేంది మావ..! ఈ క్రేజీ బ్యూటీ కిక్ సినిమా డాక్టరా..!! అస్సలు ఊహించలేరు

అయితే ఈ సినిమాలో వెంకటేష్‌కు మల్లికార్జున, మహేష్ బాబుకు సీతా రామరాజు అని పేర్లు పెట్టుకొని కథ రాసుకున్నాడట శ్రీకాంత్ అడ్డాల. అయితే సినిమాలో అంజలి పాత్ర పేరు సీత కాబట్టి మహేష్ బాబు పేరు విషయంలో గందరగోళం నెలకొంటుందని అనుకున్నారట. మరోసారి వీరిద్దరికి రాముడు, లక్ష్మణుడు అనే పేర్లు పెడదాం అని కూడా అనుకున్నారట ఇక లాభం లేదు అని పెద్దోడు, చిన్నోడు అని ఫిక్స్ చేసి చేశారట. ఇక  మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో నటిస్తున్నారు. ఈ సినిమా పాన్ గ్లోబల్ మూవీగా తెరకెక్కుతుంది. అలాగే వెంకటేష్ ఇటీవలే సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో హిట్ అందుకున్నారు. ఇప్పుడు చిరంజీవి సినిమాలో గెస్ట్ గా కనిపించనున్నారు.అలాగే త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు వెంకీ.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *