Headlines

సింగ్‌పొరాలో నక్కిన నలుగురు ఉగ్రవాదులు.. ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు టెర్రరిస్టుల హతం!

సింగ్‌పొరాలో నక్కిన నలుగురు ఉగ్రవాదులు.. ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు టెర్రరిస్టుల హతం!


జమ్మూ కాశ్మీర్‌లోని కిష్త్వార్‌‌లోని ఛత్రులోని సింగ్‌పోరా ప్రాంతంలో భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య ఎన్‌కౌంటర్ జరిగినట్లు వార్తలు వస్తున్నాయి. సింగ్‌పోరా ప్రాంతంలో నలుగురు ఉగ్రవాదులు నక్కినట్లు భద్రతా దళాలకు సమాచారం అందింది. దీంతో ఉగ్రవాదులను భద్రతా బలగాలు చుట్టుముట్టాయి. వెంటనే ఉగ్రవాదులు, భద్రతా దళాలపై కాల్పులకు తెగబడ్డాయి. దీంతో రెండు వైపుల నుండి కాల్పులు కొనసాగుతున్నాయి.

జమ్మూ కాశ్మీర్‌లో భారత సైన్యం, పోలీసుల సంయుక్త ఆపరేషన్ కొనసాగుతోంది. గురువారం(మే 22) సింగ్‌పోరా చత్రూలో కొనసాగుతున్న ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. జమ్మూ కాశ్మీర్‌లోని కిష్త్వార్ జిల్లాలోని చత్రూలోని సింగ్‌పోరా ప్రాంతంలో భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య ఉదయం ఎన్‌కౌంటర్ జరిగింది. ‘ఆపరేషన్ ట్రాషి’ అనే కోడ్‌నేమ్‌తో ఈ ఉమ్మడి ఆపరేషన్ జరిగింది. కాల్పులు జరిగిన తర్వాత అదనపు దళాలను మోహరించారు. ఉగ్రవాదులను మట్టుబెట్టడానికి ప్రయత్నాలు కొనసాగుతున్నాయని ఆర్మీకి చెందిన వైట్ నైట్ కార్ప్స్ Xలో ఒక పోస్ట్‌లో తెలిపింది.

సింగ్‌పోరా చత్రోలో రెండో పారా SF దళాలు, ఆర్మీకి చెందిన 11RR, 7వ అస్సాం రైఫిల్స్, SOG కిష్త్వార్ దళాలు సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించిన తర్వాత ఉదయం 7 గంటల ప్రాంతంలో ఎన్‌కౌంటర్ ప్రారంభమైంది. ప్రాథమిక నివేదికల ప్రకారం, సైఫుల్లాతో సహా ముగ్గురు నుండి నలుగురు ఉగ్రవాదుల బృందం చట్టూ అడవుల్లో భద్రతా దళాలచే చిక్కుకున్నట్లు భావిస్తున్నారు. జమ్మూ కాశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలోని ట్రాల్ ప్రాంతంలోని నాదిర్ గ్రామంలో వారం రోజుల క్రితం వేర్వేరు ఉగ్రవాద వ్యతిరేక చర్యలలో ముగ్గురు జైష్-ఎ-మొహమ్మద్ ఉగ్రవాదులను హతమార్చిన తర్వాత భద్రతా దళాల ఉమ్మడి బృందం గురువారం సెర్చ్ ఆపరేషన్ చేపట్టింది. కాగా, ఈ ఎన్‌కౌంటర్‌లో మరణించిన ముగ్గురు ఉగ్రవాదులను ఆసిఫ్ అహ్మద్ షేక్, అమీర్ నజీర్ వాని, యావర్ అహ్మద్ భట్‌గా గుర్తించారు. వీరంతా జమ్మూ కాశ్మీర్‌లోని పుల్వామా జిల్లా నివాసితులని స్థానిక పోలీసులు తెలిపారు.

పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత, కశ్మీర్ లోయలో భద్రతా దళాలు ఉగ్రవాదుల వేట ముమ్మరం చేశాయి. మే 20న జమ్మూ కాశ్మీర్ పోలీసులు పాకిస్తాన్‌కు చెందిన నలుగురు ఉగ్రవాద సంస్థల ఆస్తులను స్వాధీనం చేసుకున్నారు. ఉత్తర కాశ్మీర్‌లోని బారాముల్లా జిల్లాలోని సోపోర్, దక్షిణ కాశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలోని అవంతిపోరా ప్రాంతంలో పోలీసులు ఈ చర్య చేపట్టారు. సోపోర్ ప్రాంతంలో మూడు ఆస్తులను, అవంతిపోరాలో ఒక ఆస్తిని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. సోపోర్‌లో ఆస్తులు స్వాధీనం చేసుకున్న ఉగ్రవాదులలో అర్షిద్ అహ్మద్ తేలే (నవ్‌పోరా తుజ్జర్ నివాసి), ఫిర్దౌస్ అహ్మద్ దార్ అలియాస్ ఉమర్ దార్, నజీర్ అహ్మద్ దార్ అలియాస్ షబీర్ ఇలాహి ఉన్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *