వినూత్న విగ్రహాల తయారీలో తెనాలిలోని సూర్య శిల్పశాల శిల్పులది అందెవేసిన చేయి… అమరావతి పున:నిర్మాణ సభ సమయంలోనూ ఆటో మొబైల్ వేస్ట్ తో వివిధ విగ్రహాలు, అమరావతి నేమ్ బోర్డు రూపొందించి ప్రదర్శనకు ఉంచి పలువురు ప్రసంశలు పొందారు. మోడీ , ఎన్టీఆర్ భారీ విగ్రహాలను రూపొందించారు. అయితే ఆపరేషన్ సింధూర్ నేపధ్యంలో తమవంతుగా సైనికులు ఏదైనా చేయాలని ఆలోచించారు. ఇంకేముంది తమ చేతి పనితనాన్ని ఉపయోగించి భారత దేశ పటం, అదే విధంగా సైనికుడి వినూత్న విగ్రహాలను తయారు చేశారు.
ఆటో మొబైల్ ఇండ్రస్ట్రిలో లభించే వేస్ట్ బోల్డులు, నట్టులు ఉపయోగించి సైనికుడి విగ్రహాన్ని రూపొందించారు. చేతిలో తుపాకితో ఉన్న విగ్రహాం ఆకట్టుకుంటుంది. అదే సమయంలో దేశ చిత్ర పటాన్ని కూడా అదే నట్టులు, బోల్టులు ఉపయోగించి తయారు చేశారు. ఈ రెండు విగ్రహాలను తమ సూర్య శిల్పశాలలో ప్రదర్శనకు ఉంచారు.
వీటిని మంత్రి నాదెండ్ల మనోహర్ తిలకించి శిల్పులను ప్రశంసించారు. తెనాలి ప్రతిభను ప్రపంచానికి చాటుతున్న శిల్పులను ప్రత్యేకంగా సత్కరించారు. గతంలోనే ఎన్నో వినూత్న విగ్రహాలను రూపొందించి తెనాలి పేరు ప్రఖ్యాతలు ఇనుమడింపచేశారని కొనియాడారు. ఉగ్రదాడిలో పలువురు చనిపోవడం ఆ తర్వాత ఆపరేషన్ సింధూర్ విజయవంతం కావడంతో తమకు తోచిన విధంగా సైనికులకు సెల్యూట్ చెప్పాలన్న ఉద్దేశంతో ఈ విగ్రహాలను తయారు చేసినట్లు శిల్పి వెంకటేశ్వరావు తెలిపారు. వీటితో పాటు రూపొందించిన భరత మాత విగ్రహాం, మూడు సింహాల విగ్రహాం కూడా పలువురు ప్రశంసలు అందుకుంటున్నాయి.
ఇవి కూడా చదవండి
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..