నిన్నమొన్నటి వరకు సిచ్యువేషన్స్ చూస్తే 2025 సమ్మర్ కూడా పూర్తిగా సమర్పయామి అనుకున్నారు. కానీ మెల్లమెల్లగా ఈ వేసవి కూడా హౌజ్ ఫుల్ అవుతుంది. స్టార్ హీరోలెవరూ రాకపోయినా.. మీడియం రేంజ్ హీరోలే 300 కోట్ల బిజినెస్ చేస్తున్నారు. మరి ఈ మండు వేసవిలో చల్లటి వినోదాన్ని పంచడానికి వస్తున్న ఆ సినిమాలేంటి..?
మార్చి 28న ఎట్టి పరిస్థితుల్లో హరిహర వీరమల్లు విడుదలవుతుందని నమ్మకంగా చెప్తున్నారు మేకర్స్. ఒకవేళ పవన్ వస్తే.. ఆ ఒక్క సినిమాకే 200 కోట్ల బిజినెస్ జరగడం ఖాయం. మరోవైపు అదేరోజు నితిన్ రాబిన్ హుడ్, ఆ మరుసటి రోజు అంటే మార్చి 29న మ్యాడ్ స్క్వేర్ సినిమాలు రానున్నాయి. ఈ రెండు సినిమాల బిజినెస్ దాదాపు 50 కోట్లకు పైగానే జరుగుతుంది. Veer
మార్చి చివరి వారం నుంచే సమ్మర్ సినిమాల సందడి మొదలవుతుంది. రాబిన్ హుడ్, హరిహర వీరమల్లు, మ్యాడ్ స్క్వేర్ సినిమాలు ఒక్కరోజు గ్యాప్‌లోనే రానున్నాయి. పవన్ వస్తే వీటిలో కనీసం ఒక్కటైనా వాయిదా పడటం ఖాయం. ఇక ఎప్రిల్ 10న జాక్ సినిమాతో వస్తున్నారు సిద్ధూ జొన్నలగడ్డ. గత సమ్మర్లో టిల్లు స్క్వేర్తో బ్లాక్‌బస్టర్ కొట్టారీయన.
ఎప్రిల్ 18న అనుష్క, క్రిష్ కాంబినేషన్లో వస్తున్న ఘాటీ విడుదల కానుంది. మూడేళ్ళ తర్వాత స్వీటీ నుంచి వస్తున్న సినిమా ఇది. ఇక ఎప్రిల్ 25న మంచు విష్ణు కన్నప్ప విడుదల కానుంది. దీనిపై ముందు ఏ అంచనాలు లేకపోయినా.. ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్ ఉన్నారు కాబట్టి బాక్సాఫీస్ దగ్గర ప్రభావం చూపించేలా ఉంది.
ఒకవేళ పవన్ కళ్యాణ్ వస్తే వెల్ అండ్ గుడ్..! ఆయన రాకపోతే మాత్రం ఈ సమ్మర్లో రానున్న ఫస్ట్ పెద్ద సినిమా హిట్ 3. నాని హీరోగా శైలేష్ కొలను తెరకెక్కిస్తున్న ఈ సినిమా మే 1న విడుదల కానుంది. ఈ మధ్యే విడుదలైన టీజర్ చూసాక.. సినిమా రేంజ్ అర్థమైపోతుంది. కచ్చితంగా భారీ హిట్‌పై కన్నేసారు న్యాచురల్ స్టార్.