శ్రీలంకలో రామాయణంతో సంబంధం ఉన్న ప్రదేశాలను సందర్శించేందుకు వీలుగా ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ లిమిటెడ్ విశాఖపట్నం నుంచి ప్రత్యేక విమాన ప్యాకేజీని ప్రకటించింది. ఈ రామాయణ ట్రైల్ ఆఫ్ శ్రీలంక ప్యాకేజీలో శ్రీలంక రాజధాని కొలంబోతో పాటు దంబుల్ల, కాండీ, నువారా ఎలియా, మునీశ్వరం ఆలయం, మనవారి ఆలయం, దంబుల్ల గుహ ఆలయం, శ్రీ లక్ష్మీ నారాయణ పెరుమాళ్ ఆలయం, శ్రీ భక్త హనుమాన్ ఆలయం, రాంబోడ సీతా అమ్మన్ ఆలయం, సీతా ఎలియా, అశోక వాటిక, పంచముగ ఆంజనేయర్ ఆలయం , కేలానియా బుద్ధ ఆలయం ఉన్నాయి. ఆరు రోజుల పాటు సాగనున్న ఈ టూర్ కి సంబంధించిన వివరాల్లోకి వెళ్తే..
ఈ పర్యటన జూన్ 28 నుంచి మొదలై జూలై 3 వరకు ఉంటుంది.
ప్రయాణ టికెట్స్ ధరలు
సింగిల్ ఆక్యుపెన్సీకి ఒక వ్యక్తి ధర రూ. 89,845,
డబుల్ ఆక్యుపెన్సీ రూ. 69,450
ట్రిపుల్ ఆక్యుపెన్సీ రూ. 68,840.
ప్యాకేజీలో ఏఏ సదుపాయాలు అందించనున్నారంటే
విశాఖ పట్నం నుంచి కోలంబోకి.. తిరుగు ప్రయాణం కొలంబో విశాఖపట్నం ప్లైట్ టికెట్
సింగిల్, డబుల్ లేదా ట్రిపుల్ షేరింగ్ ప్రాతిపదికన త్రీ హోటల్లో హోటల్ వసతి సౌకర్యం
శ్రీలంకలోని దేవాలయాలు, స్మారక చిహ్నాలలో ప్రవేశ రుసుము.
లంకేశ్వరుడు పాలించిన లంకను.. సీతా దేవి ని దాచిన ప్రదేశంతో పాటు అనేక హిందూ దేవాలయాలను.. ప్రముఖ ప్రాంతాలను చూడాలనుకుంటే తక్కువ ధరకే అందిస్తున్న ఈ టూర్ ప్యాకేజీపై ఆసక్తి ఉన్న వ్యక్తులు మరిన్ని వివరాల కోసం లేదా బుకింగ్ కోసం విశాఖపట్నం రైల్వే స్టేషన్లోని గేట్ నంబర్ 1, ప్రధాన ద్వారం వద్ద ఉన్న IRCTC కార్యాలయాన్ని సంప్రదించవచ్చు. లేదా www.irctctourism.com వెబ్సైట్లోకి కూడా లాగిన్ అవ్వవచ్చు.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..