గణేషోత్సవానికి సన్నాహాలు ప్రారంభమయ్యాయి. ప్రతి సంవత్సరం భాద్రపద మాసంలోని శుక్ల పక్షం చతుర్థి తిథి నుంచి వరుసగా 10 రోజుల పాటు వినాయక ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుపుకుంటారు. ఈ సమయంలో గణేశుడి విగ్రహాన్ని ఇంటి పూజా గదిలో లేదా మండపాలలో ప్రతిష్టించి ఆచారాల ప్రకారం పూజిస్తారు. హిందూ పంచాంగం ప్రకారం ఈ ఏడాది ఆగస్టు 27వ తేదీన వినాయక చవితిని జరుపుకుంటారు.
వాస్తు నిపుణుల అభిప్రాయం ప్రకారం ఆకుపచ్చ గణేష్ విగ్రహాన్ని ఉత్తర దిశలో ప్రతిష్టించడం వల్ల డబ్బు సంబంధిత సమస్యలు తొలగిపోతాయి. మట్టి రంగు గణేష్ విగ్రహాన్ని ఈశాన్య దిశలో ఉంచాలి. వాస్తు ప్రకారం ఇలా చేయడం వల్ల మానసిక ఒత్తిడి, శారీరక వ్యాధుల నుంచి ఉపశమనం లభిస్తుంది.
నారింజ రంగు గణపతి విగ్రహాన్ని దక్షిణ లేదా ఆగ్నేయ దిశలో ప్రతిష్టించండి. దీంతో ఆత్మవిశ్వాసం పెరుగుతుందని అభిప్రాయపడ్డారు. జీవితంలో సంతోషం, శాంతి, గణపతి ఆశీస్సులు పొందడానికి ఇంట్లో తెల్లటి రంగు గణేష్ విగ్రహాన్ని ప్రతిష్టించండి. ఈ రంగు గణపతిని వాయువ్య దిశలో ఉంచాలి.
వాస్తు దోషాలు తొలగిపోవాలంటే గణేశుని విగ్రహాన్ని పూజా గదిలో, వంటగదిలో, ఇంట్లోని ఆఫీసులో ప్రతిష్టించడం శుభప్రదమని వాస్తు నిపుణులు చెబుతున్నారు. అయితే వాస్తు ప్రకారం ఇంట్లో ఎక్కువ గణేశుడి విగ్రహాలను ప్రతిష్టించవద్దు.
ఇంట్లో ఎడమ వైపు తొండం తిరిగి ఉన్న వినాయకుడి విగ్రహాన్ని ప్రతిష్టించడం ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది. ఇంట్లో వినాయకుడి విగ్రహాన్ని ఉంచాలనుకుంటే విగ్రహం ఎత్తు 6 అంగుళాల కంటే ఎక్కువ ఉండకూడదు.