గణేష్ చతుర్థి వచ్చేస్తుంది. భారతీయ పండుగల్లో ఇది ముఖ్యమైనది. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో వినాయక చవితి పండగను ఘనంగా జరుపుకుంటారు. వివిధ రకాల వినాయకుడి విగ్రహాలను ప్రతిష్టించి తొమ్మిది రోజుల పాటు పూజలు జరిపిస్తారు. తర్వాత చెరువుల్లో, నదుల్లో విగ్రహాలను నిమజ్జనం చేస్తారు. అయితే ఈ సంవత్సరం 2025 ఆగస్టు 27న గణేష్ చతుర్థిని జరుపుకోనున్నాము.
ఇక హిందూ మతంలో వినాయకుడికి ప్రత్యేక స్థానం ఉంటుంది. ఆయన్నీ ఆదిదేవుడు అని పిలుస్తారు. ఏ శుభకార్యం చేసినా సరే , విననాయకుడికే మొదటి పూజచేయడం తప్పనిసరి. ఇక వినాయక చవితి రోజు ప్రతి ఒక్కరూ వినాయకుడి విగ్రహాలను తెచ్చుకొని నిత్యం పూజలు జరిపిస్తుంటారు. కొందరు మండపాల్లో విగ్రహాలను పూజిస్తే, మరికొంత మంది ఇంటిలోపల విగ్రహాలను పెట్టి పూజిస్తుంటారు. కాగా, ఇప్పుడు మనం వాస్తు శాస్త్రం ప్రకారం, ఏ దిశలో వినాయకుడి విగ్రహాన్ని పెట్టి పూజించడం మంచిదో తెలుసుకుందాం.
వినాయకుడి విగ్రహాన్ని ఇంట్లో ఈశాన్య దిశలో ఉంచడం చాలా మంచిదంట. దీని వలన సంపద, ఆరోగ్యం పెరగడమే కాకుండా, ఆర్థికంగా, ఆరోగ్యపరంగా కలిసివస్తుందంట. అంతే కాకుండా తూర్పుదిశలో వినాయక విగ్రహాన్ని పెట్టినా మంచిదేనంట. కానీ వాస్తు ప్రకారంవినాయకుడి విగ్రహాన్ని పశ్చిమం లేదా దక్షిణ దిశలో ఉంచడం అశుభకరం అంట. ఇలా చేయడం వలన ఆర్థికపరమైన నష్టాలు, ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయంట.
ఇక తొండం విషయంలో చాలా మంది అనేక అనుమానాలు ఉంటాయి. చాలా వరకు ఎడమ వైపు తొండం ఉన్న విగ్రహాలనే కొనుగోలు చేసి పూజిస్తారు. అయితే తప్పనిసరిగా ఎడమవైపున ఉన్న విగ్రహాలనే పూజించాలని చెబతున్నారు పండితులు. ఎందుకంటే? దీని వలన శాంతి, శ్రేయస్సును తెస్తుందంట. ఒక వేళ కుడి వైపు వినాయకుడి తొండం ఉన్న విగ్రహాన్ని పూజిస్తే తప్పక ప్రత్యేక నియమాలు పాటించాలని చెబుతున్నారు పండితులు.
అలాగే తప్పనిసరిగా గణేష్ విగ్రహాం ఇంటి పూజగదిలో ఉండేలా చూసుకోవాలంట. దీని వలన సానుకూల శక్తి లభించడమే కాకుండా, గణేషుడి ఆశీస్సులు కూడా మీకు ఎప్పుడూ లభిస్తాయంట. ఇక మట్టి విగ్రహం మీడియం సైజులో ఉండాలంట. గణేషుడి విగ్రహంతోపాటు లక్ష్మీ దేవి కూడా ఉండటం వలన సంపద శ్రేయస్సు పెరుగుతుందంట.