
చల్లటి నీటిలో స్నానం చేయడం కాస్త పిచ్చితనంగా అనిపించవచ్చు, కానీ ఐస్ బాత్ లేదా చల్లని స్నానాలు మీ శరీరానికి, మనస్సుకు అద్భుతాలు చేస్తాయి. వారానికి ఒకసారి ప్రయత్నించవచ్చునని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఎనర్జీ లెవల్స్ పెంచుతుంది. ఐస్ బాత్ వల్ల మీ శరీరం ఉత్తేజితమవుతుంది. రక్తం ఉరకలెత్తుతుంది. సహజమైన శక్తిని అందిస్తుంది. తాజాగా ఉన్న ఫీలింగ్ అందిస్తుంది. ముఖ్యంగా ఉదయం పూట చేస్తే రోజంతా ఎనర్జటిక్‌గా ఉంటారు.
ఐస్ బాత్ వాస్తవానికి మీరు బాగా నిద్రపోవడానికి సహాయపడుతుంది. ఇది మీ నాడీ వ్యవస్థను శాంతపరుస్తుంది, మీ శరీర ఉష్ణోగ్రతను తగ్గిస్తుంది. రాత్రిపూట సులువుగా, హాయిగా నిద్రపోతారు. మీరు వ్యాయామం చేస్తుంటే లేదా కండరాలు నొప్పిగా అనిపిస్తే ఐస్ బాత్ సహాయపడుతుంది. చల్లటి నీరు మంటను తగ్గిస్తుంది, మీ కండరాలు వేగంగా కోలుకోవడానికి, నొప్పి తగ్గించడంలో సాయపడుతుంది.
ఐస్ బాత్ వల్ల మీ రక్త నాళాలు బిగుతుగా మారి తర్వాత వదులవుతాయి. దీనివల్ల రక్త ప్రసరణ మెరగవుతుంది. కాలక్రమేణా ఇది గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. రక్తపోటును నియంత్రిస్తుంది. మీ మూడ్‌కు ఐస్ బాత్ బూస్ట్‌లా పనిచేస్తుంది. ఐస్ బాత్ మరీ చల్లగా అనిపించవచ్చు. కానీ ఇది మీకు మంచి అనుభూతిని కలిగిస్తుంది. మీ మెదడులో ఎండార్ఫిన్లు వంటి ఫీల్-గుడ్ రసాయనాల విడుదలను ప్రేరేపిస్తాయి, ఇవి ఒత్తిడి, ఆందోళనను తగ్గించడంలో సహాయపడతాయి.
బరువు తగ్గడానికి కూడా ఐస్ బాత్ అద్భుతంగా పనిచేస్తుంది. మీ శరీరం చల్లగా ఉన్నప్పుడు, వెచ్చగా ఉంచటానికి ఇది ఎక్కువ శక్తిని బర్న్ చేస్తుంది. ఇది మీ జీవక్రియను పెంచడానికి, కాలక్రమేణా బరువు తగ్గించే లక్ష్యాలకు చేరువ కావడానికి సాయం చేస్తుంది. ఐస్ బాత్ మీ రోగనిరోధక ప్రతిస్పందనను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. దీనివల్ల మీరు అనారోగ్యానికి గురయ్యే అవకాశం తక్కువ. ఇది మీ శరీరానికి కొంచెం ‘షాక్’ ఇస్తుంది. ఇది వైరస్, బ్యాక్టీరియాకు వ్యతిరేకంగా బలమైన రోగనిరోధక శక్తిని నిర్మించడంలో సహాయపడుతుంది.