మన దేశంలోని అనేక ప్రాంతాలలో COVID-19 కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఎనిమిది రాష్ట్రాలు ఇప్పుడు 100 కి పైగా యాక్టివ్ ఇన్ఫెక్షన్లను నివేదించాయని ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలిపింది. పెరుగుదల ఉన్నప్పటికీ శుక్రవారం దేశవ్యాప్తంగా 1,435 మంది రోగులు కోలుకుని ఆసుపత్రుల నుండి డిశ్చార్జ్ అయ్యారు.
అత్యధిక యాక్టివ్ కేసులు ఉన్న రాష్ట్రాలు
- కేరళ – 1,336 కేసులు
- మహారాష్ట్ర – 467 కేసులు
- ఢిల్లీ – 375 కేసులు
- గుజరాత్ – 265 కేసులు
- కర్ణాటక – 234 కేసులు
- పశ్చిమ బెంగాల్ – 205 కేసులు
- తమిళనాడు – 185 కేసులు
- ఉత్తరప్రదేశ్ – 117 కేసులు
ఢిల్లీలో తొలి కోవిడ్ సంబంధిత మరణం కూడా నమోదైంది. మరణించినది 60 ఏళ్ల మహిళ అని అధికారులు నిర్ధారించారు. ప్రస్తుత కోవిడ్ తీవ్రతపై ఐసిఎంఆర్ (ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్) డైరెక్టర్ జనరల్ డాక్టర్ రాజీవ్ బెహ్ల్ మాట్లాడుతూ.. ఈ పెరుగుదల ఎక్కువగా ఓమిక్రాన్ ఉప రకాలు.. అంటే LF.7, XFG, JN.1, NB.1.8.1 వల్ల సంభవిస్తుందని, ఇవి ఇప్పటివరకు తేలికపాటి లక్షణాలను మాత్రమే చూపించాయని అన్నారు. “మేము పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నాము. మొత్తం మీద, ఈ సమయంలో, మనం పర్యవేక్షించాలి, అప్రమత్తంగా ఉండాలి కానీ ఆందోళన చెందడానికి ఎటువంటి కారణం లేదు” అని ఆయన అన్నారు.