వర్షాకాలం మొదలైంది.. దీంతో రోగాల సీజన్ కూడా వచ్చేసినట్టే..! ఎందుకంటే. వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రభలే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దానికి తోడుగా దోమలు కూడా స్వైర విహారం చేస్తుంటాయి. సాయంత్రం అయిందంటే చాలు.. దండయాత్ర మొదలుపెట్టేస్తుంటాయి. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా దోమలు రక్తం తాగేస్తాయి. దాంతో రోగాల బారినపడక తప్పదు. అందుకే చాలా మంది దోమల నివారణ కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. కొందరు మస్కిటో కాయిల్స్ వాడుతుంటారు. ఇది ఎంత డేంజరో మీకు తెలుసా..?
అవును, దోమల నివారణగా ఉపయోగించే మస్కిటో కాయిల్స్ తీవ్రమైన అనారోగ్యాన్ని కలిగిస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మస్కిటో కాయిల్ నుంచి వెలువడే పొగ పీల్చుకోవడం వల్ల ఊపిరితిత్తులు దెబ్బతినే అవకాశం ఉందని చెబుతున్నారు. . ఇది అనేక శ్వాస సంబంధ సమస్యలకు దారితీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మస్కిటో కాయిల్స్‌లోని సమ్మేళనాలు తలనొప్పిని కలిగిస్తాయి. మస్కిటో కాయిల్ ద్వారా చర్మంపై దద్దుర్లు వచ్చే అవకాశం ఉంది. ఎలర్జీ సమస్య ఉన్నవారు ఈ పొగకు దూరంగా ఉండటమే మంచిది.
అంతేకాదు.. దోమలను నివారించడానికి ఉపయోగించే మస్కిటో కాయిల్స్‌లో క్యాన్సర్ కారకాలు ఎక్కువగా ఉంటాయని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. ఇవి ఎక్కువగా ఊపిరితిత్తుల క్యాన్సర్‌కు కారణమవుతాయని అంటున్నారు. మస్కిటో కాయిల్స్ వాడకం వల్ల వచ్చే పొగతో ఆస్తమా వంటి సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఈ పొగ వల్ల పిల్లలో శ్వాసకోశ సమస్యలు వచ్చే అవకాశం కూడా ఎక్కువగా ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇలాంటి మస్కిటో కాయిల్స్ కాకుండా దోమల నివారణ కోసం ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని సూచిస్తున్నారు.
ఇవి కూడా చదవండి
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..