పాములు తమ గుడ్లను రక్షించుకోవడానికి ఇలా అన్ని ఒకే చోట గుమ్మడి గూడునట్లు తెలుస్తుంది. మధ్యలో ఉన్న చిన్న గుడ్లతో పాటు చిన్న పిల్లలు కూడా వీడియోలో స్పష్టంగా కనిపిస్తున్నాయి. అలాగే అక్కడక్కడ కొన్ని భారీ నాగుపాములు కూడా ఉన్నాయి. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఈ వీడియోను కింగ్ కోబ్రా ఆన్ డ్యూటీ అనే శీర్షికతో ఓ యూజర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ పాములను తమ గుడ్లను రక్షించుకునే పనులో నిమగ్నమై ఉన్నాయి. ప్రపంచంలోని అత్యంత ప్రమాదకరమైన పాముల్లో ఒకటైన కోబ్రా తన పిల్లలను రక్షించుకోవడానికి ఎలాంటి సాహసానికైనా సిద్ధంగా ఉంటుంది అని ఈ ఫుటేజ్ రుజువు చేస్తుంది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు రకరకాలుగా తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. వీడియో అద్భుతంగా ఉందని కొందరు, పిల్లలను రక్షించుకోవడానికి తల్లి సిద్ధంగా ఉందని కొందరు, మరికొందరు ఈ వీడియో నిజం కాదని, ఇది ఏఐ జనరేటెడ్ వీడియో అని చెబుతున్నారు. వాస్తవానికి ఇది ఏఐ జనరేటెడ్ వీడియో అని చూడగానే అర్థమవుతుంది. అయితే ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
మరిన్ని వీడియోల కోసం
భాగస్వామి కోపంగా ఉన్నరా.. ఈ తప్పులు అస్సలే చేయకండి వీడియో!