వలలో చిక్కింది చూసి ఆశ్చర్యపోయిన జాలరి

వలలో చిక్కింది చూసి ఆశ్చర్యపోయిన జాలరి


నిజమాబాద్ జిల్లా డొంకేశ్వర్ మండలం చిన్నాయనం ఊరవుతల ఎస్పారెస్పీ బ్యాక్ వాటర్స్‌లో వలకు చిక్కిందట ఈ భారీ చేప. తూకం వేస్తే 34 కిలోల బరువు ఉందట. దీంతో సంబరపడిపోతున్నాడు దాన్ని పట్టిన జాలర్లు. మరి ఇంత పెద్ద చేప వలలో చిక్కాక ఆ మాత్రం ఆనందం ఉండదా చెప్పండి. ఏదైనా ఫంక్షన్ ఉంటే.. ఈ ఒక్క చేప కోసి వండితే గెస్టులు అందరికీ వడ్డించేయవచ్చు. ఏదైనా చిన్నపాటి ఊరు జనం మొత్తానికి కూడా చేపల పులుసు వండి పెట్టొచ్చు. ఇది బొచ్చ చేప అని వారు చెబుతున్నారు. ఐదు కిలోలు, పది కిలోలు, పదియేను కిలోల దాక పెరిగే బొచ్చె చేపలు ఇప్పటివరకు చూశాం కానీ.. 34 కిలోల చేపను చూడటం ఇదే ఫస్ట్ టైం అంటున్నారు స్థానికులు. మరి ఈ చేప గత బీఆర్ఎస్ సర్కార్ ఎస్పారెస్పీ బ్యాక్ వాటర్లో విడిచిన చేప పిల్లనా.. ఇప్పటి రేవంత్ ప్రభుత్వం వదిలిన చేప పిల్లనో తెలియదు కానీ.. దీన్ని చూస్తే మాత్రం ఇది అధికార, ప్రతిపక్ష పార్టీల లీడర్లు మాదంటె మాదే ఈ పనితనం అని పేరుకోసం పంచాది పెట్టుకుంటారు అని ఫన్నీగా కామెంట్స్ పెడుతున్నారు నెటిజన్స్.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

అప్పడాలు ఇష్టమని లొట్టలేసుకొని లాగించేస్తున్నారా..!

రోజూ ఒక్క పండు తింటే.. ఉక్కులా తయారవుతారు

Balakrishna: రజినీని రికార్డ్‌ను బద్దలు కొట్టిన బాలయ్య

సొంత తండ్రి నుంచే దారుణ వేధింపులు.. ఏడుస్తూ చెప్పిన హీరోయిన్



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *