వర్షాకాలంలో కీళ్ల నొప్పులతో ఇబ్బందిగా ఉందా..? మీకోసమే ఈ అద్భుతమైన చిట్కాలు..!

వర్షాకాలంలో కీళ్ల నొప్పులతో ఇబ్బందిగా ఉందా..? మీకోసమే ఈ అద్భుతమైన చిట్కాలు..!


వర్షాకాలంలో చలి, తేమ, వాతావరణంలో మార్పుల వల్ల కీళ్ల నొప్పులు, కీళ్లు పట్టేసినట్లు అనిపించడం వంటివి ఎక్కువ అవుతాయి. ఈ సీజన్‌ లో ఆర్థరైటిస్ వంటి సమస్యలు ఇంకా ఎక్కువ అవుతాయి. ఆర్థోపెడిక్ నిపుణులు చెప్పిన కొన్ని ముఖ్యమైన చిట్కాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

వెచ్చగా, పొడిగా ఉండడం

తేమ శరీరంలోకి చేరి కీళ్ల బిగుతును మరింత పెంచుతుంది. ముఖ్యంగా మోకాళ్లు, నడుము చుట్టూ వెచ్చని దుస్తులు వేసుకోవాలి. తడి బట్టలు, తడి షూలలో ఎక్కువసేపు ఉండకండి.

రోజూ తేలికపాటి వ్యాయామం

ఇంట్లో నడవడం, యోగా, స్ట్రెచింగ్ లాంటివి చేస్తే కీళ్ల కదలికలు మెరుగవుతాయి, రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. తడి ప్రదేశాల్లో వ్యాయామాలు చేయకుండా ఉండడం మంచిది.

వాపును తగ్గించే ఆహారం

ఫ్లాక్స్‌సీడ్స్, అక్రోట్స్, చేపలు వంటి ఒమేగా 3 ఉండే ఆహారాలు ఎక్కువగా తినండి. పసుపు, అల్లం, తాజా పండ్లు కూడా మీ ఆహారంలో చేర్చుకోండి. ఉప్పు, ప్రాసెస్ చేసిన ఆహారాలు తక్కువగా తినండి. ఇవి వాపును పెంచుతాయి.

విటమిన్ D, కాల్షియం

వర్షాకాలంలో ఎండ తక్కువగా ఉంటుంది కాబట్టి విటమిన్ D తగ్గుతుంది. అందుకే విటమిన్ D సప్లిమెంట్స్, పాలు, పనీర్, ఆకుకూరలు తీసుకోవడం చాలా ముఖ్యం.

బరువు తగ్గాల్సిందే

ఎక్కువ బరువు ఉంటే మోకాళ్లు, తుంటి కీళ్లపై ఒత్తిడి పెరుగుతుంది. కొంచెం బరువు తగ్గినా నొప్పి తగ్గుతుంది.

వెచ్చని ప్యాక్

హాట్ వాటర్ బ్యాగ్ లేదా వెచ్చని నీటితో కంప్రెస్ చేస్తే నొప్పి తగ్గుతుంది. గోరువెచ్చని నీటిలో ఉప్పు వేసి స్నానం చేయడం కూడా ఉపశమనం ఇస్తుంది.

తగినంత నీరు తాగడం

నీరు తక్కువ తాగితే కీళ్లలో ఉండే ద్రవం గట్టిపడి కదలికలు కష్టమవుతాయి. కాబట్టి సరిపడా నీరు తాగడం చాలా అవసరం.

సరిగ్గా కూర్చోవడం

ఇంట్లో ఎక్కువసేపు ఒకే చోట కూర్చుంటే కీళ్లు పట్టేస్తాయి. ప్రతి 45 నిమిషాలకు ఒకసారి లేచి స్ట్రెచ్ చేయండి. కూర్చునేటప్పుడు సరైన భంగిమలో ఉండాలి.

జాగ్రత్తగా నడవడం

వర్షం వల్ల జారిపడే ప్రమాదం ఎక్కువ. అందుకే యాంటీ స్లిప్ చెప్పులు వాడండి. తడి ప్రదేశాల్లో నడవకండి. ఇంట్లో అవసరమైతే సపోర్ట్ బార్స్ పెట్టుకోండి.

నిపుణుడి సలహా అవసరం

నొప్పి ఎక్కువగా ఉంటే లేదా చాలా రోజులు తగ్గకపోతే ఆర్థోపెడిక్ డాక్టర్‌ను సంప్రదించండి. సరైన సమయంలో చికిత్స తీసుకోవడం వల్ల పెద్ద సమస్యలు రాకుండా ఉంటాయి.

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *