వరుసగా పనిమనిషి పాత్రలు.. విసుగొచ్చి సినిమాలు మానేసింది.. ఇప్పుడు ఓటీటీ స్టార్..

వరుసగా పనిమనిషి పాత్రలు.. విసుగొచ్చి సినిమాలు మానేసింది.. ఇప్పుడు ఓటీటీ స్టార్..


సినీరంగంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నప్పటికీ ఆమె తరచూ స్టీరియోటైపికల్ లేదా పనిమనిషి పాత్రలతోనే వెండితెరపై కనిపించింది. దీంతో నిరాశకు గురైన ఆమె నటన నుంచి తప్పుకుంది. కానీ ఇప్పుడు ఓటీటీలో స్టార్ అయ్యింది. ఇటీవల సూపర్ హిట్ అయిన పంచాయత్ సిరీస్ లో క్రాంతి దేవి పాత్రలో నటించి మరోసారి ప్రశంసలు అందుకుంది. ఆమె సహజ నటనకు అడియన్స్ ఫిదా అయ్యారు. ఇంతకీ ఆ నటి ఎవరో తెలుసుకుందామా.. ఆమె పేరు సునీతా రాజ్ వర్. పంచాయత్ సిరీస్ లో క్రాంతి దేవి పాత్రలో కనిపించింది. ఈ సిరీస్ ద్వారా ఆమె ఓటీటీ స్టార్ గా గుర్తింపు తెచ్చుకుంది.

కానీ ఒకప్పుడు ఆమె NSDలో శిక్షణ పొందింది. కెరీర్ మొదట్లో వరుసగా పనిమనిషి, సేవకురాలి పాత్రలతోనే నటించింది. దీంతో ఆమె పూర్తిగా నిరాశ చెంది నటనను పూర్తిగా వదిలేయాలని నిర్ణయించుకుంది. చిన్నతనంలోనే సునీతకు సినిమాలంటే నటనపై ఆసక్తి ఎక్కువ. నటి కావాలనే ఆసక్తితో హల్ద్వానీ నుండి ఢిల్లీకి NSDలో చేరింది. ముంబైకి చేరుకున్న తర్వాత ఆమెకు సరిపోయే పాత్రలు దొరకడం కష్టమైంది. చాలాసేపు వేచి చూసిన తర్వాత ఆమెకు ఎక్కువగా పనిమనిషి పాత్రలు వచ్చాయి. దీంతో విసుగు చెందిన ఆమె.. నటనారంగం నుంచి దూరమైంది. కొన్నాళ్ల తర్వాత ఇప్ుపుడు పంచాయత్ సిరీస్ ద్వారా ఫేమస్ అయ్యింది.

ఇవి కూడా చదవండి

Image

ఓటీటీని షేక్ చేస్తున్న సినిమా..పెద్ద హీరోహీరోయిన్స్ లేరు..

https://www.profitableratecpm.com/i049cyqrff?key=1e8d0b68d6836b7589273debd4b47b9f
Image

రజినీకాంత్, కమల్ హాసన్‏లతో నటించిన స్టార్ హీరోయిన్..

Image

80 కోట్లు పెడితే రూ.623 కోట్లు కలెక్షన్స్.. ఇప్పుడు ఓటీటీలో..

Image

అక్కినేని ముగ్గురు హీరోలతో కలిసి నటించిన ఏకైక హీరోయిన్..

ఆమె ‘పంచాయత్’లో బనారకస్ భార్య క్రాంతి దేవి పాత్రకు ప్రాణం పోసింది. ‘స్త్రీ’తో పాటు, సునీత ‘కేదార్‌నాథ్’, ‘ఏక్ చాలీస్ కి లాస్ట్ లోకల్’, ‘బాలా’ వంటి చిత్రాలలో నటించింది.

View this post on Instagram

A post shared by Sunita Rajwar (@sunita_rajwar)

ఇవి కూడా చదవండి : 

Tollywood: ఇండస్ట్రీలో తోపు హీరోయిన్.. సినిమాలు వదిలేసి మైక్రో మ్యాక్స్ సీఈవోతో ప్రేమ.. ఇప్పుడేం చేస్తుందంటే..

Pakeezah Vasuki: అయ్యో పాపం.. దీనస్థితిలో ఒకప్పటి కమెడియన్ పాకీజా.. సాయం చేయాలంటూ కన్నీళ్లు..

Telugu Cinema: అయ్య బాబోయ్.. ఈ హీరోయిన్ ఏంటీ ఇట్టా మారిపోయింది.. ? భయపెడుతున్న అందాల రాశి న్యూలుక్..

Tollywood: 42 ఏళ్ల వయసులో గ్లామర్ బ్యూటీ అరాచకం.. తల్లైన తగ్గని సోయగం.. నెట్టింట ఫోటోస్ వైరల్..





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *