వద్దు నాన్నా.. నాకు భయమేస్తోంది !! ఇంకొక్క క్షణం ఆగి ఉంటే ??

వద్దు నాన్నా.. నాకు భయమేస్తోంది !! ఇంకొక్క క్షణం ఆగి ఉంటే ??


సోషల్‌ మీడియాలో రోజూ మనం ఎన్నో రకాల వీడియోలు చూస్తుంటాం. కొన్ని విజ్ఞానాన్ని పంచితే కొన్ని వినోదాన్ని పంచుతాయి. మరికొన్ని భయాందోళనకు గురిచేస్తాయి. తాజాగా అలాంటి వీడియో ఒకటి సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఓ రేంజ్‌లో మండిపడుతున్నారు. ఇందులో ఓ వ్యక్తి తన పిల్లల ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టి ఆనందంగా ఫోటోలు దిగుతున్నాడు. అందుకే ఏం నేర్పిస్తున్నారు పిల్లలకి అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు నెటిజన్లు. ఓ వ్యక్తి తన పిల్లలతో కలిసి జంతు ప్రదర్శనశాలకు వెళ్లాడు. కొన్నిచోట్ల ఈ జంతువులకు అతి సమీపంగా వెళ్లే అవకాశం కూడా ఉంటుంది. కొందరు ఆ జంతువులతో సన్నిహితంగా మెలుగుతూ వాటితో ఫోటోలు, వీడియోలు కూడా తీసుకుంటారు. అక్కడి నిర్వాహకులు వాటికి అలా ట్రైనింగ్‌ ఇస్తారు. కనుక అవి సందర్శకుల జోలికి రావు. కానీ అది అన్నివేళలా పనిచేయకపోవచ్చు. అలా సింహంతో ఫొటో దిగాలనుకున్న ఓ వ్యక్తి తొలుత తన కుమారుడిని సింహం వీపు పైకి ఎక్కించాడు. పిల్లాడు భయపడుతున్నా బలవంతంగా దానిపై కూర్చోబెట్టాడు, తర్వాత మరో కుమారుడిని కూడా ఆ సింహం వీపుపై కూర్చోబెట్టాడు. ఆ తర్వాత ముగ్గురూ కలిసి ఫొటో దిగారు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

అర్ధరాత్రి నడిరోడ్డుపై వింత ఆకారం.. దగ్గరికి వెళ్లి చూడగా గుండె గుభేల్

ఢిల్లీ విమానాశ్రయంలో 2027 నాటికి ఎయిర్‌ ట్రైన్.. ప్రత్యేకతలివే

పని ఒత్తిడికి బ్యాంక్‌ ఉద్యోగిని బలి.. డ్యూటీలోనే కుప్పకూలి మృతి

విమాన ప్రయాణాలపై ఎపెక్ట్ ?? తప్పదంటున్న శాస్తవేత్తలు

అరకులోయలో పారా గ్లైడింగ్.. ట్రయల్‌ రన్‌ సక్సెస్‌



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *