
ప్రపంచవ్యాప్తంగా లివర్ క్యాన్సర్ తో బాధపడేవారి సంఖ్య చాలా పెరుగుతోంది. కానీ కొత్త పరిశోధన ప్రకారం.. ఈ వ్యాధిని చాలా వరకు పూర్తిగా నివారించవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. లివర్ క్యాన్సర్ రావడానికి ముఖ్య కారణాలు హెపటైటిస్ బి, హెపటైటిస్ సి వైరస్లు, ఎక్కువగా మద్యం తాగడం, కొవ్వు ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవడం, అలాగే లావుగా ఉండటం. ఇవన్నీ కలిసి లివర్ పై చాలా ప్రభావం చూపిస్తాయి.
కొత్త అధ్యయనం ఏం చెబుతోంది..?
కొత్తగా చేసిన పరిశోధనలో లివర్ క్యాన్సర్ కేసుల్లో 60 శాతం వరకు పూర్తిగా నివారించవచ్చని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ముఖ్యంగా హెపటైటిస్ బి వ్యాక్సిన్ తీసుకోవడం, హెపటైటిస్ సిని తొందరగా గుర్తించి చికిత్స చేయడం వంటివి చేస్తే ఈ వ్యాధిని అదుపులో ఉంచవచ్చని వారు పేర్కొన్నారు.
నివారణ మార్గాలు
- టీకాలు వేయించుకోవాలి.. హెపటైటిస్ బి కోసం తప్పనిసరిగా వ్యాక్సిన్ తీసుకోవాలి.
- క్రమం తప్పకుండా పరీక్షలు.. లివర్ సమస్యలు ఉన్నవారు రెగ్యులర్ గా చెక్‌అప్స్ చేయించుకోవాలి.
- మద్యం తగ్గించాలి.. ఎక్కువగా మద్యం తాగడం లివర్‌కు హానికరం.
- ఆహార నియంత్రణ.. కొవ్వు ఎక్కువగా ఉండే ఆహారాలు తినడం మానేయాలి.
- ఆరోగ్యకరమైన జీవనశైలి.. వ్యాయామం, బరువును అదుపులో ఉంచుకోవడం వల్ల లివర్‌ను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు.
నిపుణులు చెబుతున్న దాని ప్రకారం.. లివర్ మన శరీరంలో చాలా ముఖ్యమైన భాగం. దాన్ని కాపాడుకోవడం మన చేతిలోనే ఉంది. సరైన జాగ్రత్తలు తీసుకుంటే చాలా లివర్ క్యాన్సర్ కేసులను రాకుండా ఆపవచ్చు. లివర్ క్యాన్సర్ చాలా ప్రమాదకరమైన వ్యాధి అయినా సరైన జాగ్రత్తలు తీసుకుంటే దాన్ని పూర్తిగా నివారించవచ్చని నిపుణులు చెబుతున్నారు.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)