అదృష్టం కలిసొచ్చింది.. లాటరీలో ఏకంగా రూ.30 కోట్లు వచ్చాయి. ఏడాదిన్నర కాలంగా తనతో లీవ్ ఇన్ రిలేషన్‌లో ఉన్న ప్రియురాలిని పూర్తిగా నమ్మి.. ఆ డబ్బు ఆమె అకౌంట్లో వేస్తే.. ఆమె మరో వ్యక్తితో పారిపోయింది. వింటుంటే.. అయ్యో పాపం అనిపించేలా ఉన్న ఈ స్టోరీ కెనడాలో జరిగింది. ఈ విన్నిపెగ్‌కు చెందిన లారెన్స్ కాంప్‌బెల్ 2024లో ఒక లాటరీ టిక్కెట్ కొన్నాడు. ఆ లాటరీలో అతనికి జాక్‌పాట్ తగిలింది. CA$5 మిలియన్లు (సుమారు రూ. 30 కోట్లు) లాటరీలో అతనికి డబ్బు వచ్చింది. తనకు బ్యాంక్ అకౌంట్ లేకపోవడంతో తన గర్ల్‌ఫ్రెండ్ మెక్కే అకౌంట్లో ఆ డబ్బు జమ చేశాడు. అంతా బాగానే అనిపించింది. ఆ జంట షాపర్స్ డ్రగ్ మార్ట్‌లో విజయాన్ని ధృవీకరించే వీడియో కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
భారీ చెక్కుతో ఫోటోలకు పోజులిచ్చారు. మెక్కే చిత్రాలలో పెద్దగా ఉత్సాహంగా కనిపించనప్పటికీ, ఈ విజయాన్ని మిస్టర్ కాంప్‌బెల్ ఆమెకు ఇచ్చిన పుట్టినరోజు బహుమతిగా బహిరంగంగా అభివర్ణించారు. ఆ డబ్బు అకౌంట్లో పడిన తర్వాత మెక్కే మరో వ్యక్తితో పారిపోయింది. దీంతో లారెన్స్ కాంప్‌బెల్ ఆమెపై కోర్టులో కేసు వేశాడు. డబ్బు అకౌంట్లో పడిన తర్వాత మెక్కే అదృశ్యమైందని కాంప్బెల్ కోర్టుకు వెల్లడించాడు. ఆమె తాము ఉంటున్న హోటల్ గదికి తిరిగి రాలేదని, తన ఫోన్‌ను లిప్ట్ చేయడం లేదని, తనను సోషల్ మీడియాలో కూడా అన్ని చోట్లా బ్లాక్ చేసిందని ఫిర్యాదులో పేర్కొన్నాడు.
ఆమె కోసం వెతగ్గా.. చివరికి ఆమె వేరొక వ్యక్తితో ఓ హోటల్‌లో మంచంపై ఉండగా కనిపించిందని తెలిపాడు. “ఆమె అతన్ని మోసం చేసింది, అతని కాల్స్ తీసుకోవడానికి లేదా అతనికి సమాధానం ఇవ్వడానికి నిరాకరించింది, ఆమె తన సోషల్ మీడియా ఖాతాలలో అతన్ని బ్లాక్ చేసింది.” అని మిస్టర్ కాంప్‌బెల్ న్యాయవాది అన్నారు. మరి కోర్టు ఈ కేసులో ఎలాంటి విచారణ చేపడుతోంది. అతనికి న్యాయం చేస్తుందో లేదో చూడాలి. మొత్తానికి ప్రియురాలిని గుడ్డిగా నమ్మి మోసపోయాడు కాంప్‌బెల్.
మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి