భర్త పాదాలకు భార్యలు నమస్కారం చేయడం మనం చూస్తూ ఉంటాం.. ఏదైనా స్పెషల్ డే ఉన్నా.. ఇంట్లో పూజ చేసిన, వ్రతం చేసిన మహిళలు తమ భర్త పాదాలకు నమస్కారం చేస్తారు. ఇది మన సంస్కృతిలో ఎప్పటినుంచో వస్తున్న ఆనవాయితీ.. అయితే ఓ హీరో మాత్రం రోజూ తన భార్య పాదాలకు నమస్కారం చేస్తాడట.. కొన్ని సందర్భాల్లో బాలీవుడ్ హీరోలు రణవీర్ సింగ్, రితేష్ దేశముఖ్ కూడా తమ భార్యలు పాదాలకు నమస్కారం చేయడం మనం చూశాం.. కానీ ఈ హీరో ప్రతిరోజూ తన భార్య పాదాలకు నమస్కారం చేస్తారు. ఈ విషయాన్నీ ఆయనే స్వయంగా ఓ ఇంటర్యూలో తెలిపారు. తనకు జీవితంలో వచ్చిన కష్ట సమయంలో తన భార్య సాయంగా నిలిచిందని అందుకే ఆమె కాళ్లకు నమస్కారం చేస్తాను అని తెలిపాడు ఆ పాన్ ఇండియా స్టార్..ఇంతకూ ఆయన ఎవరంటే..
ఇది కూడా చదవండి : బాబోయ్..! మేడం మెంటలెక్కించింది..! సీరియల్ బ్యూటీ షేక్ చేస్తుందిగా..!!
సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన రేసుగుర్రం సినిమా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో అల్లు అర్జున్ హీరోగా నటించగా.. శ్రుతిహాసన్ హీరోయిన్ గా కనిపించింది. అలాగే ఈ సినిమాలో భోజ్ పూరి నటుడు రవికిషన్ విలన్ గా నటించాడు. మద్దాలి శివ రెడ్డి అనే పాత్రలో ఆయన అద్భుతంగా నటించి మెప్పించాడు. రేసుగుర్రం సినిమాతో రవి కిషన్ కు మంచి క్రేజ్ వచ్చింది. ఆతర్వాత ఆయన చాలా సినిమాల్లో విలన్ గా నటించి మెప్పించాడు. ఇదిలా ఉంటే ఆయన ప్రస్తుతం చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రవి కిషన్ ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్ ఎంపీగా సేవలందిస్తున్నాడు.
ఇవి కూడా చదవండి
ఇది కూడా చదవండి :మర్యాద రామన్నలో కనిపించిన ఈ కుర్రాడు గుర్తున్నాడా.? అతను ఇప్పుడు టాలీవుడ్ హీరో..
తాజాగా ఆయన టీవీ షోలో పాల్గొన్నారు. ఆ షోలో ఆయన మాట్లాడుతూ.. ప్రతిరోజూ తాను భార్య పాదాలకు నమస్కారం చేస్తాను అని తెలిపాడు. రవికిషన్ తన చిన్ననాటి స్నేహితురాలు ప్రీతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. తాను నటుడిగా గుర్తింపు పొందకముందే ప్రీతీ తానును పెళ్లి చేసుకుందని తెలిపాడు రవికిషన్. అలాగే జీవితంలో తనకు ఎదురైనా ప్రతి కష్టంలో తన భార్య మద్దతుగా నిలిచిందని తెలిపాడు. అలాదేవిధంగా పెద్ద కష్టాలు వచ్చినపుడు భార్యనే అండగా నిలిచిందని అందుకు కృతజ్ఞతగా ప్రతిరోజూ తన పాదాలకు నమస్కారం చేస్తాను అని తెలిపాడు రవి కిషన్.
ఇది కూడా చదవండి :నాగ చైతన్య ఫస్ట్ మూవీలో కనిపించిన ఈ నటి గుర్తుందా..?ఇప్పుడు చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి