ఒకే రోజు బరిలో దిగుతున్న వార్ 2, కూలీ సినిమాల మేకర్స్… ప్రమోషన్స్ విషయంలో మాత్రం డిఫరెంట్ స్ట్రాటజీస్ ప్లే చేస్తున్నారు. కూలీ సినిమా ప్రమోషన్ ఎప్పుడో మొదలు పెట్టింది టీమ్.
షూటింగ్ స్టార్ అయిన దగ్గర నుంచి గ్లింప్స్, టైటిల్ టీజర్, సాంగ్ టీజర్, సాంగ్ ఇలా వరుసగా ఏదో ఒక అప్డేట్ ఇస్తూ ఫ్యాన్స్‌ను ఎంగేజ్ చేస్తూ వచ్చింది. రిలీజ్ టైమ్ దగ్గర పడేసరికి యూటర్న్ తీసుకున్నారు కూలీ కెప్టెన్ లోకేష్ కనగరాజ్.
ప్రమోషన్స్‌ను పూర్తిగా పక్కన పెట్టేశారు. అంతేకాదు అసలు ప్రమోషన్ చేసే ఉద్దేశమే లేదంటూ బాంబు పేల్చారు. ఫైనల్‌గా అభిమానుల ఒత్తిడితో ట్రైలర్ మాత్రం రిలీజ్ చేస్తామన్నారు. కూలీతో పోటికి రెడీ అవుతున్న వార్ 2 స్ట్రాటజీ మరోలా ఉంది.
షూటింగ్ పూర్తయ్యే వరకు ఒక్క అప్డేట్ కూడా ఇవ్వలేదు వార్ 2 మేకర్స్. కనీసం ఫస్ట్ లుక్స్ కూడా రివీల్ చేయకుండానే మెగా మల్టీ స్టారర్‌ను పూర్తి చేశారు. అంతా పూర్తయి ఆల్మోస్ట్ ఫస్ట్ కాపీ రెడీ అయ్యే టైమ్‌కు ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు.
వచ్చే వారం నుంచి సౌత్ నార్త్ అన్న తేడా లేకుండా వార్ 2 వైబ్ కనిపించేలా ప్లాన్ చేస్తోంది మూవీ టీమ్. సౌత్‌లో ఎన్టీఆర్, నార్త్‌లో హృతిక్ సెంట్రిక్‌గా ఈవెంట్స్ ప్లాన్ చేస్తున్నారు. దాదాపు అన్ని మేజర్ సిటీస్‌లో భారీ ఈవెంట్స్‌కు రెడీ అవుతున్నారు. మరి ఈ యూనిట్స్‌లో ఎవరి స్ట్రాటజీ వర్కవుట్ అవుతుందో చూడాలి.