Rinku Singh – Priya Saroj Marriage Postponed: నవంబర్ 18న వారణాసిలో జరగాల్సిన క్రికెటర్ రింకు సింగ్, ఎస్పీ ఎంపీ ప్రియా సరోజ్ వివాహం వాయిదా పడింది. ఆ సమయంలో రింకు సింగ్ దేశీయ క్రికెట్‌లో బిజీగా ఉంటారని చెబుతున్నారు. తదుపరి వివాహ తేదీని త్వరలో నిర్ణయిస్తారని వార్తలు వినిపిస్తున్నాయి. 2026 ఐపీఎల్ తర్వాత తేదీని నిర్ణయించే అవకాశం ఉంది. ప్రియా సరోజ్ మచ్లిషహర్ స్థానం నుంచి తొలిసారి ఎంపీగా ఎన్నికయ్యారు. కొన్ని రోజుల క్రితం, రింకు సింగ్, ప్రియా సరోజ్ లక్నోలోని ఒక ఫైవ్ స్టార్ హోటల్‌లో నిశ్చితార్థం చేసుకున్న సంగతి తెలిసిందే.
నవంబర్ 18న వారణాసిలోని హోటల్ తాజ్‌లో వివాహం జరగాల్సి ఉంది. హోటల్‌లోని అతిథుల కోసం గదులు మొదలైనవి కూడా బుక్ చేశారంట. రింకు సింగ్ అక్టోబర్, ఫిబ్రవరి మధ్య రాష్ట్ర జట్టు తరపున దేశీయ క్రికెట్ ఆడుతున్నాడు. ఆ తర్వాత కొన్ని రోజులకు ఐపీఎల్ ప్రారంభమవుతుంది. ఫిబ్రవరి చివరిలో అతనికి ఆట నుంచి సమయం దొరికినప్పుడు లేదా ఐపీఎల్ 2026 తర్వాత వివాహ తేదీని నిర్ణయిస్తారని ఇరు కుటుంబాలు తెలిపినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. రెండు కుటుంబాలు కూడా వివాహం వారణాసిలో కాకుండా వేరే ప్రదేశంలో జరగాలని, ఇది డెస్టినేషన్ వెడ్డింగ్ అని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి