Headlines

రాశి మారుతున్న శుక్రుడు.. ఈ మూడు రాశుల వారికి జీవితంలోకి ధన ప్రవాహం మొదలు..!

రాశి మారుతున్న శుక్రుడు.. ఈ మూడు రాశుల వారికి జీవితంలోకి ధన ప్రవాహం మొదలు..!


జ్యోతిశాస్త్రం ప్రకారం.. గ్రహాల గమనం రాశులపై ఎంతో ప్రభావాన్ని చూపుతుందని చెబుతారు. ఈ క్రమంలోనే జూన్‌ చివరి వారంలో శుక్రుడు తన స్థానాన్ని మార్చుకోనున్నాడు. దీంతో కొన్ని రాశుల వారికి అదృష్ట పట్టనుందని జ్యోతిశాస్త్ర నిపుణులు చెబుతున్నారు. శుక్రుడు జూన్ చివరిలో తన సొంత రాశి అయిన వృషభ రాశిలోకి ప్రవేశిస్తాడని చెబుతున్నారు. శుక్రుడు ఒక నెల పాటు ఒకే రాశిలో ఉండి 12-13 నెలల తరువాత అదే రాశికి తిరిగి వస్తాడు. అలా జూన్ 29 మధ్యాహ్నం 2:17 గంటలకు శుక్రుడు వృషభ రాశిలోకి ప్రవేశిస్తాడు. అప్పటినుంచి 12 రాశులలోని ఒక మూడు రాశుల వారి అదృష్టం ప్రకాశించబోతోందని నిపుణులు చెబుతున్నారు. ఆయా మూడు రాశులు ఏవో తెలుసుకోండి.

జూన్ చివరి వారంలో వృషభ రాశిలోకి శుక్రుడు ప్రవేశిస్తాడు. మూడు రాశుల వారి అదృష్టం మారబోతుందని అంటున్నారు. బుధుడు, కుజుడు, సూర్యుడితో సహా శక్తివంతమైన గ్రహాలు కూడా ఈ నెలలో సంచరిస్తాయి. ఫలితంగా కొన్ని రాశుల వారి వ్యక్తిగత జీవితంలో పెను మార్పులు చోటుచేసుకుంటాయని చెబుతున్నారు. అంతేకాకుండా ఆర్థిక పరిస్థితులు కూడా మెరుగవుతాయి. వీరికి ధన ప్రవాహం మొదలు కానుందని చెబుతున్నారు.

కన్య : శుక్ర సంచారం వల్ల కన్యరాశివారు మంచి లాభాలు పొందుతారు. మీరు తలపెట్టిన పనిలో అపారమైన విజయం సాధిస్తారు. జీవితంలో సుఖశాంతుల మార్గం సాఫీగా సాగుతుంది. కుటుంబ సమస్యలు సులభంగా పరిష్కారమవుతాయి. ఇంట్లో శుభకార్యాలు నిర్వహించుకుంటారు.

ఇవి కూడా చదవండి

వృషభ రాశి వారికి సంపద, సౌభాగ్యం లభిస్తాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. పరిశ్రమలో పనిచేసే వారు విజయం సాధిస్తారు. అవివాహితులు ప్రేమను పొందుతారు. వివాహం జరుగుతుంది.

మకర రాశి వారికి శుక్రుని సంచారం వల్ల శుభ ఫలితాలు లభిస్తాయని జ్యోతిశాస్త్ర నిపుణులు చెబుతున్నారు.. సంపద పెరుగుతుంది. దీంతో వీరి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. జీవితంలో సంతోషం, ప్రశాంతత నెలకొంటుంది.

మకర రాశి వారికి కూడా శుక్రుని సంచారం వల్ల మంచి ఫలితాలు లభిస్తాయి. సంపద పెరుగుదలతో ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. విద్యార్థులు పోటీ పరీక్షల్లో ఆశించిన విజయం సాధిస్తారు. జీవితంలో సంతోషం, ప్రశాంతత ఉంటుంది.

నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *