కుర్ర హీరోలతో పోటీపడుతూ సీనియర్ హీరోలు వరుసగా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. ఏడాదికి ఒకటి, రెండు సినిమాలు చేస్తూ ప్రేక్షకులను విశేషంగా మెప్పిస్తున్నారు సీనియర్ హీరోలు.. చిరంజీవి, వెంకటేష్, నాగార్జున, బాలకృష్ణలాంటి సీనియర్స్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీ బిజీగా మారిపోయారు. అయితే సీనియర్ హీరోల సరసన నటించడానికి హీరోయిన్స్ దొరకడం ఒకింత కష్టమే.. యంగ్ బ్యూటీ సీనియర్ హీరోల పక్కన నటించడానికి ఆలోచిస్తారు.. కానీ ఈ ముద్దుగుమ్మ మాత్రం వరుసగా సీనియర్ హీరోల సినిమాల్లో ఛాన్స్ లు అందుకుంటుంది. ఇప్పటికే మెగాస్టార్, నాగార్జునలాంటి హీరోలతో చేసింది ఇప్పుడు మరో సీనియర్ హీరో సినిమాలో ఛాన్స్ అందుకుంది. ఆ యంగ్ బ్యూటీ ఎవరో తెలుసా.?
6 ఏళ్ల వయసులోనే ఎంట్రీ.. అవకాశాలు లేక ఆత్మహత్య చేసుకోవాలనుకుంది.. ఇప్పుడు ఆమె టాప్ సింగర్
కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన అమిగోస్ అనే సినిమాతో టాలీవుడ్ కు పరిచయం అయ్యింది ముద్దుగుమ్మ ఆషిక రంగనాథ్. మంచి అంచనాల నడుమ విడుదలైన అమిగోస్ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఆతర్వాత కింగ్ నాగార్జున హీరోగా నటించిన నా సామిరంగా సినిమాలో నటించింది. ఈ సినిమా కాస్త పర్లేదు అనిపించుకుంది. ఆతర్వాత ఇప్పుడు ఈ ముద్దగుమ్మ ఏకంగా మెగాస్టార్ సినిమాలో ఛాన్స్ అందుకుంది. చిరంజీవి నటిస్తున్న విశ్వంభర సినిమాలో హీరోయిన్ గా చేస్తుంది.
ఇవి కూడా చదవండి
ఇదేంది మావ..! ఈ క్రేజీ బ్యూటీ కిక్ సినిమా డాక్టరా..!! అస్సలు ఊహించలేరు
విశ్వంభర షూటింగ్ జెట్ స్పీడ్ తో జరుగుతుంది. ఈ సినిమా షూటింగ్ లో ఉండగానే ఇప్పుడు మరో బంపర్ ఆఫర్ అందుకుంది ఈ ముద్దుగుమ్మ. మాస్ మహారాజ రవితేజ నటిస్తున్న సినిమాలో ఆషిక రంగనాథ్ ఛాన్స్ అందుకుందని తెలుస్తుంది. రవితేజ ప్రస్తుతం మాస్ జాతర సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా తర్వాత తిరుమల కిషోర్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు. ఆ సినిమాలో హీరోయిన్ గా ఆషిక రంగనాథ్ ను ఎంపిక చేశారని తెలుస్తుంది. అంతే కాదు ఈ సినిమాకు అనార్కలి అనే టైటిల్ ను కూడా పరిశీలిస్తున్నారు.
మార్షల్ ఆర్ట్స్‌లో తోప్.. కట్ చేస్తే ఇప్పుడు ఇండస్ట్రీలోనే హాట్ బ్యూటీ.. గ్లామరస్‌కు కేరాఫ్ అడ్రస్ ఈ అమ్మడు
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి