మొన్న డాగ్‌ బాబు..ఇప్పుడు డాగేశ్‌.. మరో శునకానికి రెసిడెన్స్ సర్టిఫికెట్‌ కోసం దరఖాస్తు..!

మొన్న డాగ్‌ బాబు..ఇప్పుడు డాగేశ్‌.. మరో శునకానికి రెసిడెన్స్ సర్టిఫికెట్‌ కోసం దరఖాస్తు..!


బిహార్‌లో ఇటీవల ఒక శునకానికి డాగ్‌ బాబు అనే పేరుతో అధికారులు రెసిడెన్స్‌ సర్టిఫికెట్‌ జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా అలాంటిదే మరో సంఘటన చోటు చేసుకుంది. అది కూడా బిహార్‌లోని నవాడా జిల్లాలో వెలుగు చూసింది. జిల్లాలోని సిర్దాల బ్లాక్‌లోని ఆర్టీపీఎస్ కార్యాలయానికి డాగేశ్‌ బాబు అనే పేరున్న మరో కుక్క ఫొటోతో నివాసపత్రానికి దరఖాస్తు వచ్చినట్లు అధికారులు గుర్తించారు. ఈ విషయంపై నవాడా కలెక్టర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ దరఖాస్తు చేసిన వ్యక్తిపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకోవాలని ఆదేశించారు.

డాగేష్ బాబు పేరుతో కుక్క ఫోటోతో కూడిన నివాస ధృవీకరణ పత్రం కోసం ఆన్‌లైన్‌లో సమర్పించిన దరఖాస్తుపై జిల్లా మేజిస్ట్రేట్ రవి ప్రకాష్ పోలీసు దర్యాప్తుకు ఆదేశించారు. సిర్దాల ఆర్టీపీఎస్ కార్యాలయంలో దరఖాస్తును సమర్పించారు. దరఖాస్తుదారుడు డాగేష్ బాబు అని, తండ్రి పేరు డాగేష్ పప్పా అని, తల్లి పేరు డాగేష్ మమ్మీ అని నమోదు చేశారు. నవాడ జిల్లాలోని 11వ వార్డులోని ఖరోంధ్ గ్రామం నుండి ఈ దరఖాస్తు వచ్చినట్టిగా అధికారులు గుర్తించారు.

ఇవి కూడా చదవండి

కాగా, సోషల్‌ మీడియాలో ఈ పోస్ట్‌ వైరల్‌గా మారింది. దీంతో స్పందించిన అధికారులు ఆ సర్టిఫికెట్‌ను రద్దు చేశారు. దరఖాస్తుదారుడు, కంప్యూటర్‌ ఆపరేటర్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని పాట్నా జిల్లా మేజిస్ట్రేట్ వెల్లడించారు. అటు నెటిజన్లు సైతం పెద్ద ఎత్తున స్పందించారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *