తల్లిదండ్రులు తమ పిల్లల పట్ల చాలా శ్రద్ధ వహించాలి. ఇందులో వారి ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడం, వారికి మంచి విలువలు నేర్పడం, వారి పెరుగుదలను మెరుగుపరచడానికి కొన్ని చిట్కాలు పాటించడం వంటివి ఉంటాయి. పిల్లల నుండి పెద్దల వరకు, మనం ఏ పని చేసినా లేదా ఆటలు ఆడినా, దాని నుండి మనం కొత్తగా ఏదైనా నేర్చుకుంటాం. పిల్లల శారీరక, మానసిక అభివృద్ధిలో తల్లిదండ్రులు చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తారు. అయితే ఈ కాలంలో చాలా మంది పిల్లలు మొబైల్ ఫోన్స్‌కు బానిసలుగా మారుతున్నారు. వారిని ఫోన్‌కు దూరం చేయాలన్నా, వారిని తెలివైన వారిగా తీర్చిదిద్దాలన్నా.. కొన్ని గేమ్స్ ఎంతో ఉపయోగపడతాయి. వాటిని మీ పిల్లలతో కలిసి మీరే ఆడండి. ఆ తర్వాత వారిలో మార్పును మీరే స్వయంగా గమనిస్తారు. మరి ఆ గేమ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం..