మన చుట్టూ ఉండే గాలి ఎంత సురక్షితమైందో మనకు ఎలా తెలుస్తుంది? ట్రాఫిక్‌లో ఉన్నప్పుడు వాహనాల నుంచి వచ్చే పొగా, దీపావళి సందర్భంగా బాణాసంచా కాల్చడంతో వచ్చే పొగా వంటివి చూసి చాలా మంది గాలు కాలుష్యం గురించి మాట్లాడుతూ ఉంటారు. కానీ, మన ఇంట్లో, ఇంటి బయట, ఆఫీస్‌లో కూడా గాలి నాణ్యత ఎంత ఉంది, మనం క్వాలిటీ ఎయిర్‌ను పీలుస్తున్నామా? లేక కాలుష్య వాయువు శ్వాసిస్తున్నామా? అని మనకు మనం క్వశ్చన్ చేసుకుంటే ఆన్సర్ రాదు, పోనీ ఎవరినైనా అడుగుదామంటే.. వారికి మాత్రం ఏం తెలుస్తుంది. కానీ ఇప్పటికిప్పుడు మనముండే ప్లేస్‌లో ఎయిర్ క్వాలిటీ ఎంత అని AQI.in (Air Quality Index) అనే వెబ్‌సైట్‌ని అడిగితే మత్రం ఠక్కున చెప్పేస్తుంది. జస్ట్ అలా గూగుల్‌లోకో, క్రోమ్‌లోకో వెళ్లి.. AQI.in అని సెర్చ్ చేస్తే చాలు.. మనముండే ప్లేస్‌లో గాలి నాణ్యత ఏ స్థాయిలో ఉంది? బాగుందా? పర్లేదా? ప్రమాదకర స్థాయిలో ఉందా? అనేది చెప్పేస్తుంది.
అలాగే ప్రపంచంలో ఏ ప్రాంతంలో, ఏ సమయంలో ఎలాంటి ఎయిర్ క్వాలిటీ ఉందో కూడా చెప్పేస్తుంది. అందుకే ప్రస్తుతం ఇండియాలో ఎయిర్ క్వాలిటీపై నమ్మదగిన డేటా ఇస్తున్న వెబ్‌సైట్‌గా AQI.in నిలిచింది. ఏడేళ్లుగా ఎయిర్ క్వాలిటీపై డేటాను అందిస్తున్న AQI.in ఇప్పుడు మరింత విస్తరించింది. అయితే ఈ వెబ్‌సైట్‌ను ఎక్కువగా నవంబర్ నెలలో ఎక్కువ మంది విజిట్ చేస్తున్నారంటా. దీపావళి సమయంలోనో, పంట కాల్చే టైమ్‌లోనూ గాలి నాణ్యతను పరిశీలించేందుకు ఈ AQI.in వెబ్‌సైట్‌ను సందర్శిస్తున్నారు. అలాగే కొన్ని వార్త సంస్థలు, గాలి కాలుష్యంపై పోరాటం చేసే సామాజిక కార్యకర్తలు కూడా ఈ AQI.in వెబ్‌సైట్‌ను ప్రామాణికంగా తీసుకుంటూ.. గాలి కాలుష్యం ఎలా పెరుగుతుందో ప్రభుత్వానికి చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. స్విట్జర్లాండ్‌లో IQAir.com, చైనాలో AQIcn.org, అమెరికాలో AirNow.gov వంటి అంతర్జాతీయ ప్లాట్‌ఫారమ్‌ల తర్వాత, గాలి నాణ్యతను ట్రాక్ చేయడానికి ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా సందర్శించే సైట్‌లలో AQI.in నాల్గవ స్థానంలో ఉందని కంపెనీ పేర్కొంది.
ఇది భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన AQI సైట్ అని కూడా సదరు కంపెనీ పేర్కొంది. గత సంవత్సరం సైట్ దాదాపు డజను విదేశీ భాషలలో కొన్ని యూజర్ ఇంటర్‌ఫేస్‌లను ప్రవేశపెట్టింది. దీంతో మెక్సికో, కెనడా, రష్యా, ఇండోనేషియా, ఫిలిప్పీన్స్ నుండి గణనీయమైన యూజర్ ట్రాఫిక్ వచ్చిందని కంపెనీ ప్రాజెక్ట్ మేనేజర్ జ్ఞానేశ్వర్ హవోబిజమ్ చెప్పారు. జూలైలో కెనడాలో జరిగిన అటవీ మంటల సమయంలో సైట్ సాధారణ ట్రాఫిక్ కంటే 10 రెట్లు ఎక్కువ ట్రాఫిక్‌ను పొందింది. అయినప్పటికీ గరిష్ట ట్రాఫిక్ ఇప్పటికీ ఢిల్లీ, గురుగ్రామ్ నుండి వస్తుంది అని మణిపూర్‌కు చెందిన హవోబిజమ్ వెల్లడించారు.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి