గ్లామర్ గ్లామర్.. ఎటు చూసినా అదే.. చూడ్డానికి రెండు కళ్లు సరిపోవట్లేదే నమ్మండి..! ఏ హీరోయిన్ను తీసుకున్నా డోస్ పెంచుతూనే ఉన్నారు. కావాలంటే కీర్తి సురేష్నే తీసుకోండి.. బేబీ జాన్లో గ్లామర్ ట్రీట్ ఇచ్చిన ఈ భామ.
ఆ తర్వాత ప్రతీ 10 రోజులకోసారి క్రమం తప్పకుండా ఫోటోషూట్ చేస్తున్నారు. కొణిదెల వారమ్మాయి నిహారిక సైతం ఆ మధ్య మద్రాస్కారన్లో మాంచి గ్లామర్ సాంగ్ ఒకటి చేసారు.
తెలుగులో ఆఫర్స్ లేకపోయినా.. తమిళంలో ఉనికి చాటుకుంటున్నారు నిహారిక.
ఈమె గొడవ కాసేపు వదిలేసి మన తంగం వైపు చూద్దాం పదండి..! అదేనండీ జాన్వీ కపూర్ గురించే మనం చెప్పేది. దేవరలో ఉప్పొంగే గ్లామర్ షో చేసిన ఈ బ్యూటీ.. బయట కూడా తగ్గేదే లే అంటున్నారు. పెద్దిలోనూ పర్ఫార్మెన్స్తో పాటు అందాల ఆరబోతలో నో కాంప్రమైజ్ అంటున్నారు జాన్వీ.
కొన్నాళ్లుగా ఫామ్లో లేని పూజా హెగ్డే.. 2025నే నమ్ముకున్నారు. ఇందులో ఆల్రెడీ సూర్య రెట్రో పోయింది.. ఆశలన్నీ కూలీ, జన నాయగన్పైనే ఉన్నాయి. సినిమాలు చేసినా చేయకపోయినా సోషల్ మీడియాలో గ్లామర్ షోకు ఏ ఢోకా లేకుండా చూసుకుంటున్నారు ఈ జిగేల్ రాణి.
సమంత, తమన్నా, కియారా అద్వానీ లాంటి సీనియర్స్.. భాగ్య శ్రీ బోర్సే, శ్రీలీల లాంటి జూనియర్లు సైతం సోషల్ మీడియాను హీట్ ఎక్కిస్తూనే ఉన్నారు.