ఆమె పేరే దివ్య నగేష్. అరుంధతి సినిమాలో నటనకు గానూ బెస్ట్ ఛైల్డ్ ఆర్టిస్టుగా నంది అవార్డు కూడా అందుకుంది దివ్య. ఆ తర్వాత సింగం పులి, అపరిచితుడు చిత్రాల్లోనూ నటించి మెప్పించింది. ఇక పెద్దయిన తర్వాత నటిగా కొన్ని సినిమాల్లోనూ యాక్ట్ చేసిన దివ్య తాజాగా తన జీవితంలో సరికొత్త ఆధ్యాయానికి శ్రీకారం చుట్టింది. తన మనసుకు నచ్చిన వాడితో కలిసి మూడుముళ్ల బంధంలోకి అడుగు పెట్టింది. గత ఐదేళ్లుగా సహనటుడు, కొరియోగ్రాఫర్ అజయ్ కుమార్ తో ప్రేమలో ఉన్న దివ్య.. ఈ ఏడాది జనవరిలో నిశ్చితార్థం చేసుకుంది. ఇప్పుడు తమ ప్రేమ బంధాన్ని మరింత ముందుకు తీసుకెళుతూ వైవాహిక బంధంలోకి అడుగు పెట్టింది. ఆగస్టు 18న దివ్య- అజయ్ కుమార్ ల వివాహం ఘనంగా జరిగింది. కేవలం ఇరు కుటుంబ సభ్యులు, స్నేహితులు, సన్నిహితుల సమక్షంలో దివ్య- అజయ్ కుమార్ ల పెళ్లి వేడుక జరిగినట్లు తెలుస్తోంది. దివ్య నాగేష్ తన పెళ్లి ఫొటోలు షేర్ చేయకపోయినా ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్ కి సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. అలాగే తన బ్యాచిలర్ పార్టీ పిక్స్ ను కూడా పంచుకుంది. ప్రస్తుతం ఈ ఫోటోలతో పాటు.. ఆమె పెళ్లి ఫోటోలు కూడా నెట్టింట బాగా వైరలవుతున్నాయి. వీటిని చూసిన పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు దివ్య- అజయ్ కుమార దంపతులకు అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
మునిగిన ముంబై.. ఆర్థిక రాజధాని అతలాకుతలం
Weather Update: మరో మూడు రోజులు వానలు దంచుడే దంచుడు .. ఈ జిల్లాలకు బిగ్ అలర్ట్..
Roopchand Fish: రక్తం రుచి మరిగిన చేప.. ఇతర చేపలకు భిన్నం
పీఎం కిసాన్ డబ్బులు రాలేదా? అయితే ఇలా చేయండి
ప్రేమించిన అమ్మాయికి ‘బాంబు’ గిఫ్ట్ పార్శిల్ అందుకున్న భర్త.. చివరికి