జాక్ ఫ్రూట్ తినడానికి రుచికరంగా ఉండటమే కాదు, పోషకాలు కూడా పుష్కలంగా ఉంటాయి. పనస పండును జాక్ ఫ్రూట్ అంటారు. దీన్ని డయాబెటిస్ ఉన్న వారు తినవచ్చా లేదా అనే సందేహం ఎక్కువ మందిలో ఉంది. పనసపండులో బి విటమిన్లు, కాల్షియం, ఇనుము అధికంగా ఉంటాయి. ఇది తక్కువ కేలరీల పండు. ఇందులో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. జాక్ ఫ్రూట్ లో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్స్ వంటి పోషకాలు ఉంటాయి. ఇది డయాబెటిస్ వంటి వ్యాధుల నుండి రక్షించడానికి సహాయపడుతుంది.
డయాబెటిస్‌తో బాధపడేవారు తినే ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక, మధుమేహ రోగులు పనస తొనలు తినకూడదని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. బాగా పండిన పసన పండు తొనలను డయాబెటిస్ రోగులు తినకపోవడమే మంచిది. దీని గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. పండని పనసకాయతో వండిన వంటకాలు మాత్రం మధుమేహులు తినవచ్చు. దీని గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. జాక్ ఫ్రూట్ గుండెకు ఆరోగ్యకరమైనది. రక్షిత పోషకాలతో పాటు పొటాషియం, ఫైబర్ ను అందిస్తుంది.
జాక్ ఫ్రూట్ లో ఫైబర్, విటమిన్ సి ఉంటాయి. దాని విత్తనాలలోని సమ్మేళనాలు రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి, అంటువ్యాధులతో పోరాడటానికి సహాయపడతాయి. జాక్‌ఫ్రూట్ తినడం వల్ల లెక్కలేనన్ని ప్రయోజనాలు ఉన్నాయి. పనస తొనలు తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. అంతేకాకుండా పనస తొనలు తినడం వల్ల జీర్ణవ్యవస్థ కూడా మెరుగుపడుతుంది. పనస పండులో కేలరీలు పుష్కలంగా ఉంటాయి. ఇది సంతృప్త కొవ్వు ఉన్న పండు. పనస తొనలు తినడం వల్ల కొలెస్ట్రాల్ తగ్గుతుంది.
ఇవి కూడా చదవండి
(గమనిక: ఆరోగ్య నిపుణులు, ఇతర అధ్యాయనాల ద్వారా అందిన సమాచారం మేరకు ఈ వివరాలు అందిస్తున్నాం.. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఏదైనా సందేహాలు,సమస్యలు ఉన్నా వైద్యులను సంప్రదించడమే మంచిదని గమనించగలరు.)
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..