ఆ తర్వాత ఎండోస్కోపీతో బ్రష్‌ను బయటకు తీశారు. కోల్‌కతాలోని ఓ ఆసుపత్రిలో చోటుచేసుకున్న ఈ అరుదైన ఘటన వైద్య వర్గాల్లో సంచలనం సృష్టించింది. ఓ 37 ఏళ్ల మహిళ తీవ్రమైన కడుపునొప్పితో ఆస్పత్రికి వెళ్లింది. ఆమెకు పరీక్షలు చేసిన వైద్యులు మహిళ పొట్టలో టూత్‌బ్రష్ ఉన్నట్టు వైద్యులు గుర్తించి ఆశ్చర్యపోయారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఛాతీ నొప్పితో ఆసుపత్రికి వచ్చిన సదరు మహిళ తన సమస్య గురించి స్పష్టమైన వివరాలను చెప్పలేకపోయింది. దీంతో వైద్యులు ఆమెకు ఎక్స్‌రే, జీఐ ఎండోస్కోపీ పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల ఫలితాలు చూసి వైద్య బృందం నివ్వెరపోయింది. ఆమె కడుపులో టూత్‌బ్రష్ స్పష్టంగా కనిపించింది. సాధారణంగా, పిల్లల్లో ఇలాంటి సంఘటనలు చూసినప్పటికీ, పెద్దవారిలో ఇది అత్యంత అరుదైన కేసు అని వైద్యులు తెలిపారు. ఈ కేసును సవాలుగా తీసుకున్న డాక్టర్ సంజయ్ బసు నేతృత్వంలోని వైద్య బృందం మహిళకు పూర్తి అనస్థీషియా ఇచ్చి 45 నిమిషాల పాటు ఎండోస్కోపీ ప్రక్రియను చేపట్టారు. ఈ ప్రక్రియలో, నోటి ద్వారా ఒక సన్నని దారాన్ని పొట్టలోకి పంపి, దానితో టూత్‌బ్రష్‌ను జాగ్రత్తగా ముడివేసి, అత్యంత నైపుణ్యంతో బయటకు లాగారు. ఈ చికిత్స విజయవంతంగా పూర్తయింది. ఆమె ఇప్పుడు కోలుకుంటున్నట్టు వైద్యులు తెలిపారు. పెద్దవారిలో ఇలాంటి కేసులు చాలా అరుదని, ఆధునిక ఎండోస్కోపీ టెక్నాలజీ సాయంతో తాము ఈ సమస్యను సురక్షితంగా పరిష్కరించగలిగామని డాక్టర్ సంజయ్ బసు వివరించారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
పైసా జీతం లేకుండా 32 ఏళ్లుగా ట్రాఫిక్ డ్యూటీ.. అతని జీవితంలో ఆ విషాదం..?
రోజూ 8 గంటలు కదలకుండా కూర్చుంటున్నారా ?? అయితే ఈ వ్యాధులు మీకు దగ్గరపడుతున్నట్లే
నీటిని మరిగిస్తే బ్యాక్టీరియా చనిపోతుందా..? అధ్యయనంలో ఆశ్చర్యపోయే నిజాలు
కరోనా బాధితులకు ముందుగానే ముసలితనం.. సంచలనం రేపుతున్న లేటెస్ట్ అధ్యయనం
తిరుపతిలో బైకు వెంటపడిన చిరుత.. తృటిలో..