బ్యూటీ యష్మీ కాలేజీ రోజుల్లోనే మోడలింగ్ చేసి తర్వాత బుల్లితెరపైకి ఎంట్రీ ఇచ్చింది. 2017లో విద్య వినాయక అనే సీరియల్లో ఛాన్స్ కొట్టేసింది. తర్వాత వరసగా స్వాతి చినుకులు, త్రినయని, నాగ భైరవి, కృష్ణ ముకుంద మురారి ఇలా చాలా సీరియల్స్‌లో నటిస్తుంది.
ముఖ్యంగా ఈ బ్యూటీ ముకుందా మురారి సీరియల్ ద్వారా మంచి ఫేమ్ సంపాదించుకుంది. ఈ సీరియల్లో ముకుంద పాత్రలో ఓ వైపు ప్రేమ, మరో వైపు విలనిజంతో అందరినీ ఆకట్టుకుంది. ఇక తర్వాత బిగ్ బాస్‌లోకి అడుగు పెట్టి తన ఆట తీరుతో ప్రతి ఒక్కరి మనసు దోచేసుకుంది.
బిగ్ బాస్‌కు వెళ్లిన తర్వాత యష్మీ క్రేజ్ మరింత పెరిగిందనే చెప్పాలి. ఇక బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఈ బ్యూటీ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ అయిపోయింది. వరసగా ఫొటో షూట్స్‌తో కుర్రకారు మనసు దోచేస్తుంది.
తాజాగా ఈ బ్యూటీ బీచ్‌లో ఎంజాయ్ చేస్తుంది. బీచ్‌లో స్టైలిష్‌లుక్‌లో ఫొటోలకు ఫోజులిచ్చింది. జీన్స్‌లో తన స్టైలిష్ లుక్‌లో ఉన్న ఈ ముద్దుగుమ్మ అందానికి ఎవ్వరైనా ఫిదా అవ్వాల్సిందే.
ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు నెట్టింట తెగ వైరల్ అవుతుండటంతో వీటిని చూసిన వారందరూ బ్యూటిఫుల్..బీచ్‌లో ఏంటీ ఆ ఫోజులు అంట కామెంట్స్ చేస్తున్నారు. మరి ఆ ఫొటోలపై మీరు కూడా ఓ లుక్ వేయండి.