బీఆర్ఎస్‌లో కేసీఆర్ ఒక్కరే నాయకుడు.. పార్టీని బీజేపీలో విలీనం చేసే కుట్ర జరుగుతోందిః కవిత

బీఆర్ఎస్‌లో కేసీఆర్ ఒక్కరే నాయకుడు.. పార్టీని బీజేపీలో విలీనం చేసే కుట్ర జరుగుతోందిః కవిత


బీఆర్ఎస్‌లో కేసీఆర్ ఒక్కరే నాయకుడు.. ఇంకెవరి నాయకత్వాన్ని అంగీకరించనని ఎమ్మెల్సీ కవిత తేల్చి చెప్పారు. గురువారం(మే 29) మీడియా చిట్‌చాట్‌లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. నన్ను కేసీఆర్‌కి దూరం చేసే కుట్ర జరుగుతోందని కవిత అన్నారు. నన్ను పార్టీకి దూరం చేస్తే ఎక్కువ లాభం పొందేది ఎవరో అందరికీ తెలుసన్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌‌కు తాను అంతర్గతంగా రాసిన లేఖ ఎలా లీక్‌ అయిందని కవిత ప్రశ్నించారు. కట్టడి చేయమంటే పెయిడ్‌ సోషల్‌ మీడియాలో విమర్శిస్తున్నారని ఎమ్మెల్సీ కవిత ఆరోపించారు.

పార్టీలో కోవర్టులు ఉన్నారని అంటున్న వాళ్లు.. కేసీఆర్‌కి నోటీస్ ఇస్తే ఏం కార్యాచరణ చేపట్టారో చెప్పాలని కవిత డిమాండ్ చేశారు. నాకు నీతులు చెబుతూ.. నా మీద పడి ఏడిస్తే ఎలా? అని ప్రశ్నించారు. ఇంటి ఆడబిడ్డ గురించి ఎలా పడితే అలా మాట్లాడిస్తే అది మర్యాదేనా? అంటూ కవిత ఘాటు వ్యాఖ్యలు చేశారు. లిక్కర్‌ కేసు సమయంలోనే తాను రాజీనామాకు సిద్దపడ్డానని, కేసీఆర్ వద్దని వారించారని కవిత గుర్తు చేశారు.

‘‘సొంత పార్టీ వాళ్లే కుట్రపూరితంగా తనను ఎంపీగా ఓడించారని కవిత సంచలన ఆరోపణలు చేశారు. అదే జిల్లాలో ప్రొటోకాల్‌ ఉండాలని కేసీఆర్‌ ఎమ్మెల్సీ ఇచ్చారన్నారు. లీకు వీరులను ఎండగట్టమంటే, గ్రీకు వీరుల్లా నాపై ప్రతాపం చూపుతున్నారు. కాంగ్రెస్‌, బీజేపీపై మాట్లాడాలి కానీ.. నాపై దాడి చేస్తే ఎలా?’’ అని కవిత ప్రశ్నించారు. బీఆర్ఎస్‌ను బీజేపీలో గులాబీ పార్టీని విలీనం చేసే కుట్ర జరుగుతోందని కవిత ఆరోపించారు.

తన పార్టీ బీఆర్ఎస్ అని కవిత స్పష్టం చేశారు. కాంగ్రెస్ మునిగిపోయే నావ అన్న కవిత.. అ పార్టీతో రాయబారాలు నాకెందుకని ప్రశ్నించారు. బీఆర్ఎస్‌లో కేసీఆర్‌ ఒక్కడే నాయకుడని, ఇంకెవరి నాయకత్వాన్ని అంగీకరించనని కవిత తేల్చి చెప్పారు. తన జోలికి వస్తే బాగుండదు.. తానసలే మంచిదాన్ని కాదన్నారు. తన డిమాండ్ ఒక్కటే.. తన లేఖ లీక్ చేసిందెవరో చెప్పాలని కవిత డిమాండ్ చేశారు. దూతలను పంపి రాయబారాలు చేస్తే ఏం లాభం..? కోవర్టులు ఉన్నారని అంటున్న వాళ్లు.. కేసీఆర్‌కి నోటీస్ ఇస్తే ఏం కార్యాచరణ చేపట్టారో చెప్పాలని కవిత అన్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *