సినిమాలకు, సీరియల్స్ కు మన దగ్గర విపరీత మైన క్రేజ్ ఉంది. సినిమాలకు సమానంగా సీరియల్స్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. లాక్ డౌన్ తర్వాత సీరియల్స్ చూసే ఆడియన్స్ సంఖ్య భారీగా పెరిగిపోయింది. రకరకాల సీరియల్స్ ఇప్పుడు ప్రేక్షకులను ఆకట్టుకుంటూ దూసుకుపోతున్నాయి. ఇక సీరియల్స్‌లో నటించిన చాలా మంది ముద్దుగుమ్మలు ఇప్పుడు సినిమాల్లోనూ అవకాశాలు అందుకుంటున్నారు. సీరియల్స్ లో నటించే చాలా మంది హీరోయిన్స్ కు మించిన అందంతో కట్టిపడేస్తున్నారు. సీరియల్స్ లో చీరకట్టులో యావరేజ్ గా కనిపించే భామలు సోషల్ మీడియాలో మాత్రం వారెవ్వా అనేలా.. తమ అందాలతో మతిపోగొడుతున్నారు. తాజాగా అలాంటి వయ్యారి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ అమ్మడి లేటెస్ట్ ఫొటోలతో టాక్ ఆఫ్ ది సోషల్ మీడియాగా మారిపోయింది ఇంతకూ ఆ అమ్మడు ఎవరో గుర్తుపట్టారా.?
ఇది కూడా చదవండి : ఇదెక్కడి మేకోవర్ రా మావ..! గుర్తుపట్టలేనంతగా మారిపోయిన ఉదయ్ కిరణ్ హీరోయిన్
సీరియల్స్ ను రెగ్యులర్ గా ఫాలో చేసే ఆడియన్స్ కు ఈ చిన్నదాని గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ మధ్య ఎక్కువగా చూస్తున్న సీరియల్స్ లో గుండెనిండా గుడిగంటలు సీరియల్ ఒకటి. ఈ సీరియల్ లో మీన అనే పాత్రలో నటించిన అమ్మడు గుర్తుందా.? ఆమె పేరు అమూల్య గౌడ. కన్నడలో పలు సీరియల్స్ లో నటించిన ఈ చిన్నది.. ఇప్పుడు తెలుగులోనూ నటిస్తుంది. ప్రముఖ ఛానెల్ లో టెలికాస్ట్ అవుతున్న గుండెనిండా గుడిగంటలు సీరియల్ తో ప్రేక్షకులను అలరిస్తుంది ఈ చిన్నది.
ఇవి కూడా చదవండి
ఇది కూడా చదవండి :నాన్న ప్రతిరూపం మా తారకరాముడు..! అభిమానుల కళ్లు చెమ్మగిల్లేలా చేస్తున్న వీడియో
కన్నడ భాషలో శ్రీ గౌరీ అనే సీరియల్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ చిన్నది. అలాగే అక్కడ బిగ్ బాస్ గేమ్ షోలోనూ పాల్గొంది. బిగ్ బాస్ లో తన అందంతో పాటు ఆటతోనూ ఆకట్టుకుంది ఈ వయ్యారి భామ. అయితే సీరియల్స్ లో పద్దతిగా కనిపించే అమూల్య గౌడ.. బయట మాత్రం చాలా హాట్ గురూ.. ఈ అమ్మడి సోషల్ మీడియా పోస్ట్ లు చూస్తే మతిపోవాల్సిందే.. తన అందాలతో మతిపోగొడుతోంది అమూల్య. రెగ్యులర్ గా ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది. అందాల ఆరబోతలో హీరోయిన్స్ కు ఈ మాత్రం తీసిపోవడం లేదు ఈ సీరియల్ నటి. అమూల్య ఇన్ స్టా గ్రామ్ లో 5 లక్షలకు పైగా ఫాలోవర్స్ ఉన్నారు. హాట్ హాట్ ఫోటోలను వీడియోలను షేర్ చేస్తూ అభిమానులను కవ్విస్తుంది అమూల్య. ఈ ఫోటోలు, వీడియోలు చూసి షాక్ అవుతున్నారు నెటిజన్స్. ఆమె ఈమేనా అని కామెంట్స్ చేస్తున్నారు. సీరియల్స్ లో పద్దతిగా కనిపిస్తుంది.. సోషల్ మీడియాలో మాత్రం సెగలు రేపుతోంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
ఇది కూడా చదవండి :ఈ అమ్మాయి కళ్ళతోనే కట్టిపడేసింది.. రాజమౌళికి బాగా నచ్చిన హీరోయిన్ ఈ అమ్మడేనట
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.